Mr Bachchan : మిస్టర్ బచ్చన్ లో ఆ సీన్స్ తీసేస్తున్నారట.. ఇదేదో ముందే చేయాల్సింది..

Mr Bachchan : టాలీవుడ్ లో ఆగష్టు 15న రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో ‘మిస్టర్ బచ్చన్’ కూడా ఒకటి. మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండగా, వీళ్ళ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా మిస్టర్ బచ్చన్ తెరకెక్కగా, ఇంతకు ముందు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ కూడా మెప్పించడంతో ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలా థియేటర్లకు వెళ్లిన అభిమానులకు హరీష్ శంకర్, రవితేజ దారుణంగా దెబ్బసారు. రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు హరీష్ శంకర్ విసుగు తెప్పిస్తే, రవితేజ (Raviteja) కూడా కొత్తదనం లేని యాక్టింగ్ తో ఒకింత నిరాశపరిచాడని కామెంట్స్ వస్తున్నాయి. హరీష్ శంకర్ మార్క్ ఈ సారి ఇంతలా దెబ్బ కొడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ ని రిపేర్ చేస్తున్నారు మేకర్స్.

The makers are trimming the lag scenes in Mr Bachchan's movie

ఆ సీన్స్ ని తీసేస్తున్నారట..

ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమాకి జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమాలో కొన్ని సీన్లను ఎడిట్ చేస్తున్నారట. మిస్టర్ బచ్చన్ లో చాలా వరకు అనవసరమైన ల్యాగ్ సీన్స్, కామెడీ సీన్స్ ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేస్తున్నారట. అలాగే వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని, కొన్ని హిందీ పాటలను తగ్గించి, కొన్ని తీసేస్తున్నారట. ఇక మిస్టర్ బచ్చన్ యొక్క కొత్తగా ఎడిట్ చేయబడి ప్రింట్‌ లు ఈ రాత్రి థియేటర్లలో ప్లే చేస్తామని డైరెక్టర్ హరీష్ శంకర్ అనౌన్స్ చేసాడు. ఇక మిస్టర్ బచ్చన్ లో మొత్తం మీద 13 నిమిషాల సీన్లు ట్రిమ్ చేస్తున్నారని సమాచారం. ఇక ఫ్యాన్స్ అయితే ఈ పని ముందే చేసి ఉంటె ఇంత బ్యాడ్ టాక్ వచ్చేది కాదు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ఫస్ట్ డే దారుణమైన ఓపెనింగ్స్…

ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. అయితే టాక్ ఎలా ఉన్నా మిస్టర్ బచ్చన్ పై ఉన్న హైప్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఇలా జరుగుతుందని ఊహించనే లేదు.
ఫస్ట్ డే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.56 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా 5.26 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక రెండో రోజు బుకింగ్స్ కూడా ఆశించినంత లేవని తెలుస్తుంది. మరి వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ట్రేడ్ విశ్లేషకులు మాత్రం బహుశా ఈ వీకెండ్ లో మరో పది కోట్ల వరకు రాబట్టొచ్చని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు