Pawan Kalyan: మెగాస్టార్ నివాసానికి విచ్చేసిన పవర్ స్టార్.. హల్ చల్ చేస్తున్న వీడియో..!

Pawan Kalyan: ప్రజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న పవన్ రాజకీయాల్లో అంతకన్నా ఎక్కువ గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

సినిమాల్లోకి తనకి ఇష్టం లేకుండా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాల్లోకి మాత్రం మనస్ఫూర్తిగా ఎంట్రీ ఇచ్చి గొప్ప నాయకుడు అవ్వాలనే తపనతో కొనసాగుతున్నాడు. ఇక కొన్ని దశాబ్దాల పవన్ కల ఇటీవల నెరవేరింది. 2024లో టీడీపీతో చెయ్యి కలిపిన జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక పిఠాపురంలో భారీ మెజారిటీతో వంగా గీతాపై ఘనవిజయం సాధించాడు పవన్.

దీంతో పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే పవన్ విజయంతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటుంది. తాజాగా పవన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ఉండే నివాసానికి చేరుకున్నారు. ఇక అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు.. జై జనసేన.. అంటూ అరవడం మొదలుపెట్టారు. ప్రజెంట్ ఇదే వీడియో సోషల్ మీడియాలో షికారు చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు