Honey Rose: హనీరోజ్‌ ను వాడుకుని వదిలేసిన నిర్మాత?

Honey Rose: మలయాళ బ్యూటీ హనీరోజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హనీ రోజ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చాలా ఏళ్ల నుంచి హనీరోజ్ తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఇక బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో ఓవైపు బాలయ్య బాబుతో రొమాన్స్ చేస్తూనే…. మరోవైపు బాలయ్యకు అమ్మ పాత్ర కూడా చేసింది. ఈ సినిమాలో బాలయ్య బాబుకు, హనీ రోజుకి మధ్య వచ్చే సూపర్ హిట్ సన్నివేశాలతో హనీరోజ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఆ సినిమా నుంచి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ఆ సినిమా అనంతరం సినిమా అవకాశాలు, ప్రమోషన్స్, అంతేకాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో హనీరోజ్ చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఇక వీరసింహారెడ్డి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది నిజానికి హనీ రోజ్ మలయాళ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది.

ఇక మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాతో మలయాళంలో కూడా ఈ బ్యూటీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో కూడా వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు ప్రమోషన్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ హనీరోజ్ భారీగానే డబ్బులను సంపాదిస్తోంది. సోషల్ మీడియాలో కూడా హనీరోజ్ కి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అదే రీతిలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తూ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది.

- Advertisement -

Honey Rose tweeted that she will share bikini pics if RCB win the match
ఈ క్రమంలోనే తాజాగా హనీరోజ్ కి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హనీరోజ్ సినీ కెరీర్ ప్రారంభంలో ఓ తమిళ నిర్మాత సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పాడట. కానీ ఆ నిర్మాత నేను చెప్పినట్టు చేస్తేనే సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అన్నాడట. ఇక దీనికి హనీరోజ్ ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజులు టార్చర్ పెట్టారట. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు