Tamil Movies : ధనుష్ సినిమాలు బంద్.. కుబేర పోస్ట్ పోన్ అవుతుందా?

Tamil Movies : తెలుగు సినిమాలకు క్రేజ్ ఎక్కువ.. సినిమా వస్తుందని ప్రకటించినప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు హంగామా ఉంటుంది. కానీ తమిళ్ సినీ ఇండస్ట్రీలో మాత్రం సినిమా విడుదల అయ్యేవరకు నమ్మకాలు లేవు.. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా మొదలైన ‘ధృవ నక్షత్రం’ (Druv Nakshatram ) సినిమా ఇప్పటిదాకా థియేటర్లలోకి రాలేదు. ఇప్పటివరకు లెక్క లేనన్ని సినిమాలు విడుదల ఆగిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి కోలీవుడ్ స్టార్ ధనుష్ ( Danush ) కు రాబోతుందని తెలుస్తుంది. ఆయన నుంచి రాబోతున్న కుబేర (Kubera ) మూవీ పలు కారణాల వల్ల ఆగిపోయిందనే వార్తలు ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పైగా ఆయన సినిమాలను బ్యాన్ చేసేలా తమిళ ఇండస్ట్రీలోని నిర్మాతల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

అసలు మ్యాటరేంటంటే.. ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్ చేయడానికి 2024 దాకా వేచి చూడాల్సి వచ్చింది.. ఇలా ఎన్నో సినిమాలు మొదలయ్యాక ఆగిపోయాయి. దీంతో తమిళ సినిమా నిర్మాతల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ పనులన్నింటిని తాత్కాలికంగా నిలిపివేయబోతున్నారు.. తాజాగా తమిళ సినిమా నిర్మాతల సంఘం, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరికే వరకూ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ధరలు పెరగడం, హీరోల రెమ్యూనరేషన్ పెరగడం అలాగే సినిమా టెక్నీషియన్స్ డిమాండ్ చెయ్యడం పై చర్చలు జరిపినట్లు సమాచారం.

The reason why Tamil industry banned hero Dhanush
The reason why Tamil industry banned hero Dhanush

స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లు సినిమా షూటింగ్ లకు సరిగ్గా హాజరు కాకపోవడం పై సమావేశంలో తీవ్రంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి విషయం పై కమిటీ పరిశీలించినట్లు తెలుస్తుంది. ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా కూడా మొదలు కాదు. కొత్త సినిమా ప్రాజెక్టులన్నీ కూడా అనౌన్స్‌మెంట్ దగ్గరే ఆగిపోతాయి. ఇక హీరో ధనుష్ వల్ల నిర్మాతలకు పెద్ద తలనొప్పులు వస్తున్నాయని సమావేశంలో చర్చించారు.. అందుకే ఆయన సినిమాలను బంద్ చేస్తూ రెడ్ కార్డు ను జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల రాయన్ ( Raayan ) సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు కుబేర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వార్తలు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఈ సినిమా ఆగిపోతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు