The Goat : విజయ్ ‘ గోట్ ‘ నుంచి రెండో పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

The Goat : కొలీవుడ్ హీరో విజయ్ దళపతి లేటెస్ట్ మూవీ ‘ది గోట్’.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమా విజయ్ లుక్ డిఫరెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఈ సినిమా పై ఆసక్తిని చూపిస్తున్నారు.. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని తెలుస్తుంది… తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను కొద్ది నిముషాల క్రితమే రిలీజ్ చేశారు.. ఆ సాంగ్ లిరిక్స్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి..

విజయ్ పుట్టినరోజు కానుకగా, మేకర్స్ ఈ మూవీ యొక్క స్పెషల్ గ్లింప్స్​ రిలీజ్ చేశారు. విజయ్ ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. ఇక డ్యూయల్ రోల్లో బైక్ పై విజయ్ యాక్షన్​ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్ ను విడుదల చేసారు.. ‘చిన్నచిన్నకంగాళ్’ అనే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. విజయ్ ఈ ఎమోషనల్ ఫ్యామిలీ సాంగ్ ని , యువన్ శంకర్ రాజాతో కలిసి పాడారు. ఈ పాటకు కబిలన్ వైరముత్తు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.. ప్రస్తుతం ఈ లిరిక్స్ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి..

The second song from Vijay's 'Goat' is out..
The second song from Vijay’s ‘Goat’ is out..

ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది.. జీ నెట్‌వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. డిజిటల్ రైట్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమాలో జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు