Kanguva Trailer : కంగువ ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లు బద్దలవ్వాల్సిందే..

Kanguva Trailer : తమిళ స్టార్ హీరో సూర్య సరికొత్త కాన్సెఫ్ట్ లతో కొత్త సినిమాలను చేస్తూ చేస్తూ దూసుకుపోతున్నాడు. తమిళ్ మాత్రమే కాదు తెలుగులో కూడా ఆయనకు క్రేజ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం సరికొత్త కథతో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ గూస్ బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు.. ఈ సినిమా ట్రైలర్ తమిళ్ వర్షన్ లో చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేశారు.. ఆ ట్రైలర్ లో బాబీ డియోల్ పెర్ఫార్మన్స్ పీక్స్.. ఒక్కో సీన్ భయంకరమైన విజువల్స్ తో అదరగొట్టాయి పుట్టించింది.. దాంట్లో సూర్య ఎక్ప్రెషన్స్ మైండ్ బ్లాక్.. ఒక్కమాటలో చెప్పాలంటే కిల్లింగ్ అనే చెప్పాలి.. మొత్తానికి ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్ తీసినట్లు బ్యాగ్రౌండ్ విజువల్స్ ను చూస్తే తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతుంది..

- Advertisement -

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. గతంలో చాలా అప్డేట్స్ ఆ సీన్స్ గురించి చెప్పాయి.. ఇకపోతే టీజర్ అసలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడటం చూడొచ్చు. టాలీవుడ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది.. ఈ సినిమా విడుదల తేదీ పై అధికార ప్రకటన అయితే రాలేదు కానీ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కంగువ తర్వాత సూర్య 43 సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుంది.. ఈ మూవీ అక్టోబర్ 10న థియేటర్స్ లోకి రానుండగా..దీనికి రెండు నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం, సూర్య విశ్వరూపం చూపించడం ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. ఆ తర్వాత ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు