Pushpa2 Shooting Update:ఫైనల్ గా కాంప్రమైజ్ ..ఇగోలు పక్కన పెట్టిన సుక్కు, బన్నీ..

Pushpa2 Shooting Update: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 .. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఇక సినిమాను ముందుగా ఆగస్టు 15 న విడుదల చేయనున్నారని ముందుగా ప్రకటించిన కొన్ని కారణాల వల్ల సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేశారు. ఈ మధ్య సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ బన్నీ , సుక్కు షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టారు..

గత కొన్ని రోజులుగా ఈ సినిమా పై గాసిప్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వల్లే సుక్కు సినిమా నుంచి తప్పుకున్నాడని , బన్నీ కి సుక్కుకు గొడవలు ఉన్నాయని అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. కొన్ని రోజుల క్రితం బన్నీ సుక్కు షూటింగ్ ను పక్కన పెట్టి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

The shooting of Pushpa 2 again started.. Action scenes are being shot
The shooting of Pushpa 2 again started.. Action scenes are being shot

పుష్ప 2 విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో షూటింగ్ ను పూర్తి చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అందుకే సుక్కు , బన్నీలు ఇగోలను పక్కన పెట్టి మిగిలిన పెండింగ్ పార్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో క్లైమాక్స్ సీన్ సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు