Kalki 2898AD : ‘ కల్కి’ మూవీ ఫస్ట్ టికెట్ ను కొన్న స్టార్ హీరో..ఎంతకు కొన్నాడంటే?

Kalki 2898AD : కల్కి.. కల్కి.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట వినిపిస్తుంది.. ప్రభాస్ ఈ సినిమాలో నటించడంతో ఈ సినిమా పై అంచనాలు రోజు రోజుకు రెట్టింపు అవుతున్నాయి.. సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ తో సినిమాకు విడుదలకు ముందే మంచి క్రేజ్ ఏర్పడింది.. ఎప్పుడూ డార్లింగ్ ను ఆన్ స్క్రీన్ మీద చూస్తామా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. తాజాగా ముంబైలో భారీ ఈవెంట్ ను నిర్వహించారు.. ఆ ఈవెంట్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

ఈ ఈవెంట్ కు ప్రభాస్, అమితాబ్, ప్రొడ్యూసర్, కమల్ దీపికా పాల్గొని సందడి చేశారు.. ముఖ్యంగా దీపికా, అమితాబ్, ప్రభాస్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. ఈవెంట్‌లో ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడారు. అతడిపై దీపికా పదుకోణ్‌తో పాటు అమితాబ్‌, రానా సెటైర్స్ వేస్తూ ఈ ఈవెంట్‌లో కనిపించారు.. ఈ సినిమా కోసం డైరెక్టర్ బాగా కష్టపడ్డారని అశ్విన్ పై యూనిట్ మొత్తం ప్రశంసలు కురిపించారు.. అమితాబ్ ప్రభాస్ ను ఓ ఆట ఆడుకున్నారు.. ఆ వీడియోలు కూడా మనం చూసాము.. అయితే ఈ సినిమా మొదటి టికెట్ ఎవరు కొన్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది..

The star hero who bought the first ticket of 'Kalki' movie..
The star hero who bought the first ticket of ‘Kalki’ movie..

కల్కి మొదటి టికెట్‌ను నిర్మాత అశ్వనీదత్ నుంచి బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ 500 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ ఫస్ట్ టికెట్‌ను కమల్‌హాసన్‌కు అమితాబ్ బచ్చన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.. టికెట్ ను తీసుకున్న బిగ్ బి నిర్మాత కాళ్లు మొక్కాడు.. ఆ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఆ తర్వాత కల్కి ఫస్ట్ టికెట్‌ను అమితాబ్ నుంచి తీసుకున్న కమల్‌హాసన్ ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యారు. అమితాబ్ బచ్చన్ నటించిన షోలే మూవీ టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురుచూసిన సంగతుల్ని గుర్తుచేసుకున్నారు… టికెట్ ను కమల్ కు ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు