Star singer: తప్ప తాగి పోలీసులకు చిక్కిన స్టార్ సింగర్.. అరెస్ట్ చేసి కేసు నమోదు..!

Star singer: ప్రముఖ అమెరికన్ సింగర్ అండ్ గ్రామీ అవార్డ్ విజేత జస్టిన్ టింబర్ లేక్ అరెస్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తప్ప తాగి మద్యంలో మునిగి తేలుతూ డ్రైవింగ్ చేయడంతో న్యూయార్క్ ఐలాండ్లోని సాగ్ హార్బర్ లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇక ప్రస్తుతం ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. కాగా 2002లో సోలో రికార్డింగ్ సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన తన టాలెంట్ తో గ్రామీ అవార్డు విన్నర్గా నిలిచాడు. ప్రస్తుతం ఫర్గెట్ టుమారో పేరుతో గ్లోబల్ టూర్ లో ఉన్నాడు.

The star singer who was drunk and caught by the police
The star singer who was drunk and caught by the police

ఇక మార్చిలో స్టార్ట్ అయిన కొత్త ఆల్బమ్.. ఎవ్రీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ .. ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక‌ వచ్చే వారంలో చికాగో, న్యూయార్క్ లోని కొన్ని ఈవెంట్స్ ఛాయనున్నాడు. అంతేకాకుండా అనంతరం యూరప్ లో ఈ నెలాఖరులో కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈలోపే ఈయన అరెస్ట్ అవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు