Dil Raju : లవ్ సాంగ్ ను పాడిన ప్రొడ్యూసర్ దిల్ రాజ్.. స్టార్ సింగర్స్ దిగదుడుపే..

Dil Raju : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్ నిర్మించిన సినిమాలు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. కుటుంబ కథా చిత్రాలను నిర్మించడం మాత్రమే కాదు. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో కూడా ముందుంటాడు.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో కొత్త నటులు కూడా కనిపిస్తుంటారు. దిల్‌ రాజులో నిర్మాత మాత్రమే కాదు. మరో టాలెంట్‌ కూడా ఉంది. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో ఏదో ఒక పాత్రలో తళుక్కున మెరుస్తారు. ఆయనలో నటుడు కూడా ఉన్నారని నిరూపించుకున్నారు..

అలాగే ఇప్పుడు ఆయన ఒక మంచి గాయకుడు అని నిరూపించుకున్నాడు.. దిల్ రాజ్ ఓ సినిమాలో పాట పాడిన విషయం చాలా మందికి తెలియదు.. ఆ పాటతో పాటుగా రొమాంటిక్ సాంగ్ ను కూడా పాడినట్లు తెలుస్తుంది. ఆ పాట వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ పాటలు ఏంటో ఒకసారి మనం కూడా వినేద్దాం..

అక్కినేని నాగచైతన్య హీరోగా ఆరంగ్రేటం చేసిన సినిమా జోష్.. వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.. అక్కినేని కుటుంబం వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని దిల్ స్వయంగా దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు. సందీప్‌ చౌతా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అయితే ఇందులో ఓ పాటను దిల్‌ రాజు పాడారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ‘అన్నయొచ్చినాడో.. వెలుగులు వెన్నెల్‌ తెచ్చినాడో..’ పాటను దిల్‌రాజు స్వయంగా పాడటం విశేషం..

- Advertisement -

ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది.. దిల్ రాజ్ పాడిన విధానం అందరికీ నచ్చింది.. ఆయన ముందు స్టార్ సింగర్స్ కూడా పనికిరారని కామెంట్స్ చేశారు.. అంతేకాదు ఓ లవ్ సాంగ్ ను కూడా పాడినట్లు తెలుస్తుంది. ఆయన పాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని, అమలతో కలిసి నటించిన నిర్ణయం సినిమాలోనిది. ఆ సినిమాలో ‘హలో గురూ ప్రేమ కోసమే..’ అనే సాంగ్ చాలా పెద్ద హిట్. ఆ సాంగ్‌ను దిల్ రాజు పాడిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఎంత బాగా పాడారో ఓ సారి వినేసెయ్యండి.. ఇక ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా తో పాటుగా మరో తొమ్మిది సినిమాలను నిర్మిస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు