Young Hero: కోట్లు ఇచ్చిన ఆ యాడ్ చేయను.. బడా హీరోలపై మండిపడుతూ కామెంట్స్ చేసిన యంగ్ హీరో..!

Young Hero: బాలీవుడ్ బడా హీరోలు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ అందరూ కలిసి పొగాకు యాడ్ చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సొసైటీలో సెలబ్రిటీ హోదాలో ఉన్న వీరు తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఇలాంటి యాడ్స్ చేస్తే అభిమానులు ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

కానీ ఎవరు ఏమైపోయినా పర్లేదు అనుకుని డబ్బు కోసం విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈ హీరోలు. కుర్రాళ్ళు చెడిపోయేందుకు కారణం అవుతున్నారు. అయితే యంగ్ హీరో కార్తీక్ మాత్రం ఇందుకు వ్యతిరేకం అంటూ యాడ్ ను తిరస్కరించాడు. నిమిషం యాక్ట్ చేస్తే చాలు కోట్లు కుమ్మరిస్తామన్న ఈ యాడ్ కి తాను ఒప్పుకోలేదు.

The young hero made angry comments on the big heroes
The young hero made angry comments on the big heroes

ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన కార్తీక్.. ఈ స్థానంలో ఉండి కాస్త బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అనుకున్నట్లు తెలిపాడు. కానీ దీనిపై స్పందిస్తున్న ప్రేక్షకులు.. బడా హీరోలు కార్తీక్ ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అన్ని కోట్లు కూడా పెట్టి ఇప్పటికీ ఎందుకు అంత కక్కుర్తి పడుతున్నారో అర్థం కావడం లేదు.. అంటూ విరుచుకు పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు