Mirai: మాంత్రికుడిగా మంచు మనోజ్..వణికిపోవాల్సిందే

Mirai:  టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ సినిమాలు బాగానే వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన చాలా సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు… కుర్ర హీరో తేజ సజ్జ కూడా మల్టీస్టారర్ సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఆ సినిమానే మిరాయ్. తేజ హీరోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్… తదితర అప్డేట్లు వచ్చేసాయి. క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు.

Image

- Advertisement -

ఇక ఈ బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో ఓ మంత్రగాడి పాత్రలో మంచు మనోజ్ కనిపించనున్నాడు. అయితే తాజాగా మంచు మనోజ్ కు సంబంధించిన ఒక పోస్టర్ను రివిల్ చేసింది చిత్ర బృందం.

ఇందులో కత్తి పట్టుకొని భయంకరంగా ఉన్నాడు మంచు మనోజ్. ఇక మంచు మనోజ్ పాత్రకు సంబంధించిన టీజర్ రేపు ఉదయం 11:34 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.

https://x.com/peoplemediafcy/status/1792084171176993119

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు