Anirudh: యువకుడు, ఉత్సాహవంతుడు ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను నిలబెడతాడు

Anirudh: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. చాలా చిన్న ఏజ్ లోనే కొలవరి అనే పాటతో ప్రపంచం మొత్తాన్ని షేక్ చేశాడు అనిరుద్. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన త్రీ అనే చిత్రం కోసం ఈ పాటను కంపోజ్ చేశాడు అనిరుద్. అయితే అప్పట్లో ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ పాట మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది. చాలామంది అభిమానులను అనిరుద్ కు తీసుకొచ్చింది. అక్కడితో అనిరుద్ వరుస అవకాశాలను అందుకున్నాడు.

ఇక ప్రస్తుతం అనిరుద్ హవా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అందరికీ దాదాపు అదిరిపోయే మ్యూజిక్ ను అందించాడు. కేవలం మ్యూజిక్ ను అందించడమే మాత్రం కాకుండా అదిరిపోయిన బ్యాగ్రౌండ్స్ కొన్ని కూడా అందిస్తాడు అనిరుద్. ఒక నార్మల్ సీన్ కూడా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బీభత్సంగా ఎలివేట్ అవుతుంది. అది అనిరుద్ మ్యూజిక్ ఉన్న పవర్. పిట్ట కొంచెం కూత గానం అనే సామెత అనిరుద్ కి పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది.

తెలుగులో గ్రాండ్ ఎంట్రీ

ఇకపోతే తెలుగులో కూడా అనిరుద్ ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. ఈ సినిమా సాంగ్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం ఊహించిన స్థాయిలో ఆడలేదు. అలానే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది.
కథలో ఉన్న కొన్ని లోటుపాట్ల వలన సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే అరవింద సమేత వీర రాఘవ సినిమా కూడా అనిరుద్ సంగీతం అందించాల్సి ఉంది. కానీ అజ్ఞాతవాసి సినిమా ఫీల్ అవ్వడంతో అర్ధాంతరంగా అనిరుద్ ఆ ప్రాజెక్టు నుంచి తొలగించారు. ఆ విధంగా ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ అప్పట్లో తప్పిపోయింది.

- Advertisement -

Anirudh Ravichander

జెర్సీ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్

ఆ తర్వాత నాని హీరోగా చేసిన జెర్సీ సినిమాకి సంగీతం అందించాడు అనిరుద్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఒక హై ఇస్తుంది. అయితే జెర్సీ సినిమాతో తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు అనిరుద్. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో అనిరుద్ వలనే సినిమాకు మంచి హైపు వస్తుందని చెప్పొచ్చు. లేకపోతే ఎట్టకేలకు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు సంగీతం అందించే అవకాశాన్ని దక్కించుకున్నాడు అనిరుద్.

జైలర్ ఫస్ట్ సాంగ్ ను మించిపోతుంది

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ మే 19న రిలీజ్ కానుంది. దీనిని చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే చాలామంది సోషల్ మీడియా వేదికగా ఒక మీమ్ వైరల్ చేస్తున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ ను మరోవైపు అనిరుద్ ను పెట్టి యువకుడు ఉత్సాహవంతుడు ఎన్టీఆర్ అభిమానుల ఆశలను నిరాశపరచడం అంటూ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే ఈ పాట జైలర్ ఫస్ట్ సింగల్ కంటే పెద్ద హిట్ అవుతుంది అంటూ రీసెంట్ గా నిర్మాత నాగ వంశీ నుంచి కూడా చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు