Prabhas – Hanu : ప్రభాస్ కి ఇమాన్వి కి మధ్య ఇంత ఏజ్ గ్యాపా? ఫస్ట్ టైం చిన్న హీరోయిన్ తో డార్లింగ్ రొమాన్స్..

Prabhas – Hanu : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఆది పురుష్ తో నిరాశ పరిచినా, సలార్ తో సత్తా చాటాడు. ఇక ఈ ఇయర్ కల్కి2898AD తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి పలు రికార్డులు తిరగరాశాడు. ఇక ఆ వెంటనే గ్యాప్ కూడా తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇక తాజాగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా హను రాఘవపూడి తో సినిమా మొదలుపెట్టాడు ప్రభాస్. ఎప్పుడో ఫిక్స్ అయిన ఈ ప్రాజెక్ట్ తాజాగా నిన్న పూజా కార్యక్రమాలతో అఫిషియల్ గా లాంచ్ చేసారు. ఇక ఈ సినిమాలో అనూహ్యంగా కొత్త హీరోయిన్ ని తీసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇమాన్వి ఇస్మాయిల్ (Imanvi Ismail) అనే అమ్మాయి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమవుతుంది.

There is a 16-year age gap between Prabhas and heroine Imanvi Ismail

కొత్త హీరోయిన్ గురించి చర్చ..

అయితే నిన్నటి నుండి ఈ అమ్మాయి గురించి నెట్టింట ఒకటే చర్చ నడుస్తుంది. అసలు కొత్త హీరొయిన్ ని ప్రభాస్ (Prabhas) సినిమాకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ.. నెట్టింట తెగ చర్చ నడుస్తుంది. అయితే ఓపెనింగ్ లాంచ్ ఈవెంట్ లో అయితే ఇమాన్వి క్యూట్ గా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తుంది. హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్లు ఇలాగే ఉంటారు. బహుశా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారో సరైన సమాధానం సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ అమ్మాయి ఢిల్లీకి చెందిన అమ్మాయి కాగా, ఈమె కుటుంబ పూర్వికులు పాకిస్థాన్ కి చెందిన వారట. గ్రాడ్యుయేట్ చేసిన ఇమాన్వి సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా ఫేమస్ అయింది.

- Advertisement -

ప్రభాస్ కి ఇమాన్వి కి ఇంత గ్యాపా?

ఇదిలా ఉండగా ఇమాన్వి గురించి చర్చ నడుస్తుండగా, ప్రభాస్ ఇంత వరకు నటించిన హీరోయిన్లలో అందరి కన్నా తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్ ఈమెనే అని తెలుస్తుంది. ఇమాన్వి ప్రస్తుత వయసు 29 సంవత్సరాలు కాగా, ప్రభాస్ 45 ఏళ్ళు. అంటే ఇమాన్వి కి – ప్రభాస్ కి మధ్యలో దాదాపు 16 ఏళ్ళ గ్యాప్ ఉందని చెప్పాలి. ఇతర స్టార్ హీరోలు ఇంత కన్నా చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్లతో నటించినా, ప్రభాస్ ఇంత ఏజ్ గ్యాప్ హీరొయిన్ తో నటించడం ఇదే ఫస్ట్ టైం. అయినా ఓపెనింగ్ ఈవెంట్ లో ఈ అమ్మాయి బాగానే అట్రాక్ట్ చేసింది. పైగా హను రాఘవపూడి సినిమాల్లో హీరోయిన్లు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తారో తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్ త్వరలోనే వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు