Tollywood Heroines : ఒక్క సినిమాతో బాలీవుడ్ కు మాకాం మార్చిన హీరోయిన్లు వీరే…

Tollywood Heroines : తెలుగు సినిమాల్లో కొత్త హీరోయిన్లకు కొదవలేదు.. వేరే ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్లు ఇక్కడ సినిమాల్లో దున్నెస్తున్నారు.. ఇప్పటివరకు తెలుగులో నటించిన బాలీవుడ్ హీరోయిన్లు, సినిమాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

These are the Bollywood heroines who have made films in Telugu
These are the Bollywood heroines who have made films in Telugu

సుష్మితా సేన్..

బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈమె 1994 లో మిస్ యూనివర్స్ గా నిలిచింది.. ఆ తర్వాత హిందీ, తమిళ్ తెలుగులో సినిమాలు చేసింది.. నాగార్జున తో రక్షకుడు సినిమా చేసింది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. బాలీవుడ్ కు మాకాం మార్చింది..

నమ్రత..

హీరోయిన్ నమ్రత గురించి అందరికీ తెలుసు.. ఈమె చేసిన సినిమాల కన్నా కూడా మహేష్ బాబు భార్యగానే బాగా పాపులర్ అయ్యింది.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి కేవలం మహేష్ బాబుకు మేనేజర్ గా వ్యవహారిస్తుంది…

- Advertisement -

కంగనా రనౌత్..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించింది.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోలేదు.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది..

కత్రినా కైఫ్..

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా మళ్లీశ్వరి… ఈ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో పాప బాగా హర్ట్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు..

కియారా అద్వానీ..

కియారా అద్వాని మహేష్ బాబు భారత్ అనే నేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమాలో నటించింది.. ఆ సినిమా బాగా దెబ్బేసింది.. దాంతో తెలుగుకు కొంతకాలం దూరం అయ్యింది.. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

కృతి సనన్..

బాలీవుడ్ బ్యూటీ కృతి మహేష్ బాబు నెంబర్ 1 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మళ్ళీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది..

అనన్య పాండే..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీగా వచ్చిన లైగర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అతి దారుణంగా దెబ్బేసింది.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతుంది..

అలియాభట్..

అలియాభట్ తెలుగులో త్రిపుల్ ఆర్ సినిమా చేసింది.. ఆ సినిమాకు ఆస్కార్ కూడా దక్కింది.. ఈ అమ్మడు నటనకు తెలుగు జనాలు ఫిదా అయ్యారు.. తెలుగులో బాగా బిజీ అవుతుందని అనుకున్నారు..కానీ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలకు మాత్రమే అంకితం అయ్యింది.. వీళ్లే కాదు.. దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలు కూడా తెలుగులో సినిమాలు చేశారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు