Tollywood Heroines : చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు వీరే..

Tollywood Heroines : తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.. అతి చిన్నవయస్సు నుంచే సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పుడు హీరోయిన్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఆ హీరోయిన్లు ఎవరు ఏ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కీర్తి సురేష్..

tollywood star heroines chaldhood photos
tollywood star heroines chaldhood photos

‘నేను శైలజ’ సినిమాతో అందరి హృదయాలను గెలుచుకున్న కీర్తి సురేష్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి సురేష్ కుమార్ నిర్మాత. తల్లి మేనక నటి. 80 వ దశకంలో బిజీ హీరోయిన్. మలయాళం, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తల్లి నుంచి నటనను వారసత్వంగా అందుకొని కీర్తి బాలనటిగా కెరీర్ ప్రారంభించింది.. 2000 లో ఫైలెట్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. మహానటి సినిమాతో మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

- Advertisement -

హన్సిక..

tollywood star heroines chaldhood photos
tollywood star heroines chaldhood photos

ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఈమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. పలు సీరియల్స్ తో పాటుగా, సినిమాల్లో కూడా నటించింది.. దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..

శ్రీదివ్య..

tollywood star heroines chaldhood photos
tollywood star heroines chaldhood photos

జగపతిబాబు, అర్జున్ నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాని జాగ్రత్తగా చూస్తే ఓ చిన్నారి ముద్దుముద్దుగా మనల్ని ఆకర్షిస్తుంది. ఆమె ఎవరో కాదు మనసారా సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ దివ్యనే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.. ఇప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉంది..

శ్రీదేవి..

tollywood star heroines chaild wood photos
tollywood star heroines chaild wood photos

స్వర్గీయ నటి అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తన నాలుగో ఏట శ్రీ దేవి కెమెరా ముందుకు వచ్చారు. “తుణైవన్” అనే తమిళ సినిమాలో బాల మురుగన్ గా నటించారు.. ఆ తర్వాత తెలుగు, హిందీ తో పాటు భాషల్లో బిజీ హీరోయిన్ అయ్యారు..

శ్రియా శర్మ..

tollywood star heroines chaild wood photos
tollywood star heroines chaild wood photos

మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా నటించిన పాప శ్రీయా శర్మ.. దూకుడు చిత్రంలోనూ సమంతకు చెల్లెలిగా నటించి శభాష్ అనిపించుకుంది. 2015 లో రిలీజ్ అయిన గాయకుడు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లే ఉన్నారు.. అందులో బేబీ షామిలి, శాలీని, నిత్యా మీనన్, అనుష్క మల్హోత్రా, అంకిత, సుహాని, సునైనా తో పాటుగా చాలా మందే ఉన్నారు.. వీళ్ళల్లో కొందరు బిజీ హీరోయిన్లు అయితే, మరికొందరు మాత్రం రెండు మూడు సినిమాలకే ఇండస్ట్రీకి దూరం అయ్యారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు