Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్స్ ఇవే..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఏం అయ్యాడు.. ఆయన ఒక రాష్ట్ర భాధ్యతలను తన భుజాల పై మోస్తున్నాడు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ముక్కు సూటి మనిషి, ఏదైన కూడా కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తాడు. ఈయన ఎప్పుడూ తన గురించి ఏది దాచుకోడు.. ప్రతి విషయాన్ని తప్పైనా, రైటైనా జనాలకు చెబుతాడు.. అందుకే యూత్ పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తారు.. పవన్ ను దేవుడిగా భావిస్తారు.. ఒకవైపు వరుస సినిమాలతో పాటు, ప్రజా సభలకు హాజరవుతూ జనాలకు దగ్గరవుతున్నాడు.. తన గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్స్ ఇవే అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

గతంలో పవన్ తన చదువు గురించి ఆసక్తి కర విషయాలను చెప్పాడు.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు ఓ ఈవెంట్ కు హాజరైన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. డిప్యూటీ సీఏం అవ్వక ముందు ఎన్నో కాలేజ్ ఈవెంట్స్ కు హాజరయ్యారు. అందులో ఓ సందర్బంలో ఆయన మాట్లాడుతూ..తన విద్యాభ్యాసం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. తన జీవితంలో బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు పంచుకుంటూ తన ఇంటర్మీడియట్ పరీక్షల గురించి చెప్పారు పవన్ కళ్యాణ్. తాను ఇంటర్ పరీక్షలు రాస్తున్న సమయంలో తన తోటి విద్యార్థులు, స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లి పరీక్షలు రాస్తున్నా.. తాను మాత్రం చిటీలు పట్టుకెళ్లలేదని చెప్పాడు పవన్ కళ్యాణ్. పరీక్షల్లో తాను ఫెయిల్ అయినా సరే కానీ కాపీ కొట్టకూడదన్న భావనతో.. నిజాయితీగా పరీక్షలు రాసి ఇంటర్ లో ఫెయిల్ అయినట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. తాను పరీక్షలు ఉత్తీర్ణత సాధించకపోయినా నైతికంగా మాత్రం విజయం సాధించినట్లు తెలిపారు పవన్..

These are the top secrets that no one knows about Pawan Kalyan..
These are the top secrets that no one knows about Pawan Kalyan..

తనకు చదువు అబ్బకపోవడం పై తన తండ్రి ఎప్పుడూ అరిచేవాడని చెప్పాడు. ఎవరన్నా పెద్దగా భయపడను కానీ నాన్న అంటేనే భయం.. ఇక నా చదువు గురించి అడగటం మానేసినట్లు ఆయన మానేశాడు అని చెప్పుకొచ్చాడు. జీవితంలో పరాజయాలు ఎదురవుతాయని, కానీ రేపు కచ్చితంగా విజయం అందుకుంటారని సూచించారు. అయితే తాను నిత్య విద్యార్థినని, జీవితం నుంచి ఎంతో నేర్చుకుంటున్నా అన్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు