Tollywood expensive Movies : టాలీవుడ్‌లో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ఇవే..

Tollywood expensive Movies : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలానే ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సినిమాలు గ్లోబల్ స్థాయిలో హిట్ టాక్ ను అందుకోవడం వల్ల ఎక్కువమంది లేట్ అయినా పర్వాలేదు కానీ ఒక్కసినిమా పాన్ ఇండియా లెవల్ కు వెళ్లాలని అనుకుంటారు.. ఈ ఏడాదిలో కూడా భారీ బడ్జెట్ సినిమాల వస్తున్నాయి.. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణులాంటి స్టార్ హీరోలు అంతా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నారు.. ఈ ఏడాదిలో వీరు చేస్తున్న సినిమాలేంటి? ఎప్పుడు విడుదల అవుతాయో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పుష్ప 2..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతున్నారు.. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా దాదాపు 500 కోట్లతో తెరకేక్కుతుంది.. ఈ సినిమాను మొదట ఆగస్టులో అనుకున్నారు.. కానీ ఇప్పుడు డిసెంబర్ లో విడుదల చెయ్యనున్నారు.

గేమ్ ఛేంజర్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమాకు ఏకంగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాను కూడా సెప్టెంబర్ లో విడుదల చెయ్యనున్నారు.

- Advertisement -

దేవర..

గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర.. కొరటాల దర్శకత్వం లో తెరకేక్కుతుంది.. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చెయ్యనున్నారు.

అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా కూడా 300 కోట్ల తో తెరకెక్కుతుంది.. ఈ సినిమాను దేవర కు పోటీగా విడుదల చెయ్యనున్నట్లు సమాచారం.. అలాగే సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు