Bollywood: రాజకీయం తో కప్పిపుచ్చుతున్నారు. – ది కేరళ స్టోరీ హీరోయిన్

ఏప్రిల్ 26 న విడుదలైన “ది కేరళ స్టోరీ” ట్రైలర్ ఇండియా లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్ సినిమా పరంగానే కాక రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుంది. కేరళ లో కొన్నేళ్ల కిందట జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఈ సినిమాను సుదీప్తో సేన్ అనే దర్శకుడు తెరకెక్కించగా సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం లో ప్రముఖ హీరోయిన్ ఆదా శర్మ ఫీమెల్ లీడ్ గా నటించగా యోగితా బిహాని, సోనియా, సిద్ధి ఇధ్నాని, విజయ్ కృష్ణ ప్రముఖ పాత్రలు పోషించారు.

ట్రైలర్ చూసిన కామన్ ప్రేక్షకులు ట్రైలర్ చాలా బాగుందని నిజ జీవితాల్లో చరిత్ర కప్పేసిన ఇలాంటి సంఘటనలు సినిమాల ద్వారా అయినా వెలుగులోకి రావాలని అంటున్నారు. కొన్నేళ్ళకిందట వచ్చిన “కాశ్మీర్ ఫైల్స్” చిత్రంలాగే మూవీ కూడా సంచలన విజయం సాధితుందని అంటున్నారు. అయితే కొంత మంది విమర్శకులు మాత్రం ఈ సినిమా ద్వారా చాలా నష్టం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల కోసమే ఈ మూవీ వచ్చిందని ఈ సినిమా ను బ్యాన్ చేయాలనీ మహారాష్ట్ర శివసేన ఎంపీ అరవింద్ సమాత్ అన్నారు. ఇలా కొంతమంది రాజకీయ ప్రముఖులు ఈ సినిమాని బ్యాన్ చేయాలనీ చెప్తున్నారు.

దీనికి ఈ చిత్ర హీరోయిన్ ఆదాశర్మ బదులిచ్చింది. ఈ చిత్రం ఎన్నికల గురించి కాదు. ఎజెండా, మతం vs మతం.. ఇది చాలా పెద్ద విషయం. చావు బ్రతుకులు, ఇంకా ఉగ్రవాదం vs మానవత్వం గురించి ఈ సినిమా తీయడం జరిగింది. దీనిని ప్రచారం అని పేర్కొంటూ, కేరళలో ప్రతి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన కథను రాజకీయ నాయకులు కప్పిపుచ్చుతున్నారు, అని ఆదాశర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఏది ఏమైనా ఈ సినిమా లో ఉన్న విషయం తెలియాలంటే మే 5 న విడుదలయ్యే రోజు వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు