They Call Him OG : 50k దాటిన ఇంట్రెస్ట్స్… ఓజీ కోసం ఆకలి మీదున్న మెగా ఫ్యాన్స్

They Call Him OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాను థియేటర్లలో వీక్షించడానికి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలు అంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ అయిపోవడంతో ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేయనున్నారు. అయితే ఆయన నటిస్తున్న కొత్త సినిమాను థియేటర్లలో వీక్షించడానికి తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. తాజాగా టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజికి నమోదైన ఇంట్రెస్ట్ లను బట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

50K దాటిన ఇంట్రెస్ట్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజి. ఈ మూవీలో పవన్ వయోలెంట్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. 1950లో బ్యాగ్రౌండ్ ముంబై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఓజి మూవీ రూపొందుతుంది. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నారు. తమన్ ఓజి మూవీకి సంగీతం అందిస్తుండగా, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

Pawan Kalyan OG Movie
బుక్ మై షో లో 50K ఇంట్రెస్ట్స్

ఇక విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ బిగ్ స్క్రీన్ పై కన్పించక చాలా కాలమే అవుతోంది. దీంతో ఆయన సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఆకలి మీద ఉన్నారంటే.. మూవీ రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ రికార్డు సంఖ్యలో ఇంట్రెస్ట్ లు నమోదయ్యాయి. బుక్ మై షోలో ఏకంగా ఇప్పటిదాకా అక్షరాలా అరలక్ష అంటే 50కేకి పైగా ఇంట్రెస్ట్ లు రావడం విశేషం. ఈ మూవీని సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

- Advertisement -

పవన్ రీఎంట్రీ ఎప్పుడంటే?

పవన్ గత ఆరు నెలల నుంచి ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేశారు. తాజాగా ఏపీలో ఎలెక్షన్స్ ముగిసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో ఆయన మళ్లీ సెట్స్ లో ఎప్పుడు అడుగు పెడతాడా? అని మెగా ఫ్యాన్స్ తో పాటే యంగ్ డైరెక్టర్స్ సుజీత్, హరీష్ శంకర్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ ఈ నెలలో కొంత విరామం తీసుకొని మేలో తన కుటుంబంతో కొన్ని రోజులు ట్రిప్ కు వెళ్లనున్నారని తెలుస్తోంది.

ఓజీ విషయానికొస్తే.. జూన్‌లో ఓజీ షూట్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి కాగా, పెండింగ్ షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ మూవీతో పాటే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు చిత్రాలకు జూలై, ఆగస్టులో వరుసగా డేట్లు కేటాయించారు పవన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు