Upasana :డబ్బు కోసమే రామ్ చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడన్నారు – ఉపాసన

మెగా కోడలు “ఉపాసన కొణెదల” గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలుగా, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సామాన్యులకు కూడా అండగా నిలుస్తోంది. రామ్ చరణ్ 2012లో అపోలో అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు.

అయితే పెళ్లయిన కొత్తలో ఎక్కువగా బయటకు, మీడియా ముందుకి రాకపోయినా ఇప్పుడు మాత్రం ఉపాసన రెగ్యులర్ గా ఏదో ఒక మంచి వార్తతోనే వార్తలలో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పెళ్లయిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రామ్ చరణ్ పరిచయమయ్యాడని, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని తెలిపింది ఉపాసన. ఆ తరువాత ఇరు కుటుంబాల నేపద్యాలు వేరైనప్పటికీ ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పింది.

రామ్ చరణ్ తో పెళ్లి విషయంలో తన ఆంటీ, సోదరీ చాలా హెల్ప్ చేశారని తెలిపింది ఉపాసన. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలలోనూ కొంతమంది నన్ను జడ్జ్ చేస్తూనే ఉండేవారు. చరణ్ కి భార్యగా మారిన తరువాత మొదట్లో నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని, చరణ్ డబ్బుల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని ట్రోల్స్ చేశారు. ఎందుకంటే వాళ్లకు నా గురించి ఏమీ తెలియదు. గడిచిన ఈ పదేళ్లలో వారికి నా గురించి తెలిసింది. ఆ సమయంలో కుంగిపోకుండా వాటిని ధైర్యంగా జయించాను. ఇక ఆ రోజు నన్ను ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. ఇవాళ నేను ఒక ఛాంపియన్ అని ఫీల్ అవుతున్న అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు