#TheyCallHimOG Song Ready : ఫస్ట్ సింగిల్ రెడీ, అనౌన్స్మెంట్ ఎప్పుడంటే

#TheyCallHimOG Song Ready: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ఏడు సినిమాలు తో సూపర్ హిట్లు అందుకొని యూత్ కి ఒక ఐకాన్ హీరోగా మారాడు. చాలామంది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఊగిపోయేవారు. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు హవా కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక ట్రెండ్ సెట్టింగ్ అని చెప్పొచ్చు. ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ పవన్ స్టైల్ కి ఉంది.

అజ్ఞాతవాసి కి ముందు తర్వాత

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న అతి కొద్దిమంది స్నేహితులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రచయితగా కెరియర్ ను మొదలు పెట్టిన త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారి ఆ తరువాత వరుస హిట్ సినిమాలను చేసి స్టార్ డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ కి బాగా దగ్గరై పోయారు త్రివిక్రమ్. చాలా పర్సనల్ విషయాలు కూడా పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచుకుంటూ ఉంటారు. పవన్ కెరియర్ లో రెండో సారి సినిమా చేసి కూడా హిట్ ఇచ్చిన ఏకైక దర్శకుడు త్రివిక్రమ్. ఇకపోతే ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమాని చేశారు అదే అజ్ఞాతవాసి. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా ఈ సినిమా మిగిలిపోతుంది అని అందరూ ఊహించారు. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఇటువంటి సినిమా ఒకటి రాకపోతే బాగుండు అనే విధంగా చాలామంది ఫీలయ్యారు. వాస్తవానికి ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంటుంది. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ వలన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా తర్వాత ఒక రెండేళ్ల పాటు సినిమాలుకు గ్యాప్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ సినిమాలు వదిలేస్తా అని కూడా చెప్పుకొచ్చాడు.

వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. పింక్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ లా అనిపించింది. ఈ సినిమా తర్వాత చేసిన భీమ్లా నాయక్ కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. తర్వాత వచ్చిన బ్రో సినిమా పరవాలేదు అనిపించుకుంది.

- Advertisement -
TheyCallHimOG Song Ready
TheyCallHimOG Song Ready

అభిమానుల ఎదురుచూపులన్నీ ఓజీ కోసం

సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా ఓ జి. డి వి వి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. స్వతహాగా పవన్ కళ్యాణ్ కు సుజిత్ అతిపెద్ద వీరాభిమాని. సుజిత్ సినిమా కళ్యాణ్ తో ఓకే అయింది అనగానే గబ్బర్ సింగ్ సినిమాను సుజిత్ ఎలా ఎంజాయ్ చేశాడో ఆ రోజుల్లో వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే రీసెంట్ గా ఓజి సినిమా నుంచి వచ్చిన ఒక వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఓజీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ కంప్లీట్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ను వచ్చే నెల మొదటి వారంలో ఇవ్వనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు