Ali: ఇది అలీ అసలు క్యారెక్టర్, సక్సెస్ లేకపోతే ఎక్కడా ఉండడు

Ali Resigned ysrcp party: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ కమెడియన్స్ లో అలీ ఒకరు. అలీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అలీ చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా మారాయి. ఇకపోతే ఇటువైపు సినిమాలు తో పాటు అటు రాజకీయాల్లో కూడా మంచి బిజీగా మారాడు అలీ. వైఎస్ఆర్సిపి పార్టీలో కీలక నేతగా కూడా వ్యవహరించాడు.

పవన్ కళ్యాణ్ నటించిన ఎక్కువ సినిమాల్లో అలీ కనిపించారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత అలీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండటం వలన వీళ్లిద్దరి మధ్య విభేదాలు కూడా వచ్చాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే అలీ 1999 సంవత్సరం నుంచి డాక్టర్ రామానాయుడు గారు పాలిటిక్స్ లో ఉండటం వలన ఆయనకు సపోర్ట్ గా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తను కూడా రాజకీయాల్లో కొంచెం బిజీగా మారాడు.

Ali

- Advertisement -

ఇకపోతే ఆలీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ఒక వీడియో రూపంలో ప్రకటించాడు. తన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అలానే తను చేసిన సేవా కార్యక్రమాలు వీటన్నిటిని కూడా వీడియోలో క్లారిటీగా చెబుతూ, ఇకపై సామాన్య ఓటర్ లాగానే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే అలీ పెట్టిన ఈ వీడియోకి కొందరు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వైయస్సార్సీపి పార్టీ ఓడిపోయింది కాబట్టి అలీ రాజీనామా చేశాడు లేకపోతే దానిలోనే కొనసాగేవాడే అంటూ కొందరు, టిడిపి పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటూ మరికొందరు, పవన్ కళ్యాణ్ కి స్నేహితుడు కాబట్టి జనసేన పార్టీలో జాయిన్ అవుతారని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా అలీ మాత్రం పూర్తిగా రాజకీయాలనుంచి దూరమవుతున్నట్లు చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు