Srikanth Odhela: శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేయబోయే సినిమా బ్యాక్డ్రాప్ ఇదే

Srikanth Odhela: దసరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. నానిని 100 కోట్ల క్లబ్ లో చేర్చిన మొదటి సినిమా ఇది. ఇకపోతే సినిమా పైన ప్యాషన్ తో సినిమాలు చేసే దర్శకులు అది తక్కువ మంది ఉంటారు అందులో సుధాకర్ చెరుకూరి ఒకరు. సుధాకర్ చెరుకూరి తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. అయితే దసరా సినిమా ఆ డిజాస్టర్స్ అన్నిటిని కూడా కవర్ చేసింది అని చెప్పొచ్చు. కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది.

శ్రీకాంత్ విషయానికి వస్తే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడే సుకుమార్ శ్రీకాంత్ టాలెంట్ ను గుర్తించాడు. శ్రీకాంత్ గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ దాదాపు వెయ్యి మందికి కాస్ట్యూమ్స్ వేయించడంలో శ్రీకాంత్ కీలకపాత్ర వహించాడు అంటూ చెప్పుకొచ్చారు. లేకపోతే సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన చాలామంది దర్శకులుగా నిలబడ్డారు. అయితే శ్రీకాంత్ మాత్రం సెపరేట్ గా ఒక ప్రొడ్యూసర్ పట్టుకొని నాని హిట్టు కొట్టాడు.

Srikanth Odela

- Advertisement -

ప్రస్తుతం శ్రీకాంత్ మళ్ళీ నానితో సినిమా చేయబోతున్నట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి. దీని గురించి అధికార ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పుడు సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక దసరా సినిమా కోసం నాని ఎంతలా కష్టపడ్డాడు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన బరువును పెంచుకోవడంతో పాటు యాసలో కూడా మంచి పట్టు సాధించాడు. ఇప్పుడు మళ్లీ సికింద్రాబాద్ చెందిన వ్యక్తిలా కనిపిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు