Bharateeyudu 2: భారతీయుడు2 లో ఆ ఇద్దరికీ ఇది చివరి సినిమా.. ఎవరో తెలుసా?

Bharateeyudu 2: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భారతీయుడు 2.. ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తున్నారు మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. ఆ ట్రైలర్ లో ఓ ఇద్దరు నటులు గురించి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ఈ ట్రైలర్ ను చూస్తుంటే ‘దశావతారం’ చిత్రంలో అనేక పాత్రల్లో కమల్ నటవిశ్వరూపమే చూపించారు. ఇప్పుడు భారతీయుడు 2 ట్రైలర్ చూస్తుంటే మళ్లీ అదే ఫీల్ కలుగుతుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. ట్రైలర్ కనిపించే ముగ్గురు నటులకు ఇదే చివరి సినిమా.. మనోబాల, నెడుముడి వేణు, వివేక్ ముగ్గురూ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కన్నుమూశారు. వీరు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆ పాత్రల విషయంలో ఏఐ టెక్నాలజీ కూడా వాడినట్లు సమాచారం.. మొత్తానికి శంకర్ అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేసాడు..

This is the last movie for both of them in Bhartiyadudu2.
This is the last movie for both of them in Bhartiyadudu2.

ఈ సినిమాలో నటించిన వీరంతా ఈ సినిమాలో కీలకం అందుకే టెక్నాలజీ ని వాడినట్లు తెలుస్తుంది. గత 27 ఏళ్ల క్రితం వచ్చిన కమల్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా రాబోతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన మేకర్స్ కొన్ని అనివార్యకారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ లు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ లు నిర్మిస్తున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు