Shobhitha Dulipala : నాగచైతన్య కాబోయే భార్య అవార్డుల లిస్ట్ ఇదే..

Shobhitha Dulipala : టాలీవుడ్ లో ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత దూలిపాళ్ళ ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.. చైతూ, సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. కానీ వీరిద్దరి మనస్పర్థలు కారణంగా విడిపోయినట్లు తెలిపారు. అంతేకాదు విడాకులు కూడా తీసుకున్నారు. వీరిద్దరూ మళ్లీ కలుస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ వీరిద్దరు సినిమాలను చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. కానీ నాగ చైతన్య మరో హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతూ వచ్చాడు. చివరకు నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం పై సమంత ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక నాగ చైతన్య కాబోయే శోభిత సినిమాలతో పాటుగా ఎన్నో అవార్డులను అందుకుంది. ఇంతవరకు ఆమె అందుకున్న అవార్డులు ఏంటో ఒకసారి చూసేద్దాం..

శోభిత దూలిపాళ్ళ గురించి మొన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాగా శోభిత నటనపై ఇంట్రెస్ట్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ తన అంద, చందాలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి సినిమా మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. ఇక నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించింది.

This is the list of awards of Naga Chaitanya's fiancee..
This is the list of awards of Naga Chaitanya’s fiancee..

శోభిత దూలిపాళ్ళ అవార్డ్స్..

2019లో గ్రాజియా మిలియన్ అవార్డ్స్ వారిచే బ్యాక్ థ్రు పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును దక్కించుకుంది. తర్వాత అదే ఏడాది జీక్యూ ఇండియా అవార్డ్‌, ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లను కూడా దక్కించుకుంది. ఇక 2022లో లైన్స్ గోల్డ్ అవార్డ్స్ వేడుకల్లో మౌల్డ్‌ బ్రేకర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును అందుకుంది. ఎల్లే స్టైలిష్ అవార్డులో వేడుకల్లో జెన్ Z స్టైల్ ఐకాన్ అవార్డును దక్కించుకుంది. ఇక 2023లో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటిగా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ వేదికపై పాపులర్ ఓటిటి ఫ్లాట్‌ఫాం అవార్డ్‌ దక్కింది. ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అవార్డ్‌తో గేమ్ చేంజర్‌ ఆఫ్ ది ఇయర్‌ బెస్ట్ యాక్టర్‌గా మరోసారి అవార్డును దక్కించుకుంది.. అలాగే ట్రేల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడ దక్కించుకుంది. ఇన్ని అవార్డులు గెలుచుకుంది కాబట్టే నాగ చైతన్య ప్రేమలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి డేట్ ను త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు