Deepika Padukone : ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రభాస్ పరువు తీసిన దీపికా.. అస్సలు ఊహించలేదు..

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది.. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఇలాంటి టైం లో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న ఫ్యాన్స్ ఆమె అన్న మాటల పై ట్రోల్స్ చేస్తున్నారు… ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది..

ఈ సినిమాకు భారీగానే మేకర్స్ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే.. వరుసగా ఏదొక అప్డేట్ ఇవ్వడంతో పాటుగా సినిమా కథను, క్లైమాక్స్ ను కూడా రివిల్ చేశాడు డైరెక్టర్.. దాంతో సినిమా పై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి.. మొన్న ముంబైలో గ్రాండ్ గా ఈవెంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఈవెంట్ కు కమల్ హాసన్, అమితా బచ్చన్, ప్రభాస్, దీపికా పాల్గొన్నారు.. ఈ సందర్బంగా దీపికా తనకు ఇష్టమైన తెలుగు స్టార్ హీరో ఎవరన్నది చెప్పింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో దీపికను డార్లింగ్ ఫ్యాన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు..

This is the reason why Prabhas fans are trolling Deepika Padukone
This is the reason why Prabhas fans are trolling Deepika Padukone

దీపికా మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పేసింది.. మహేష్ బాబుతో కూడా తను కలిసి నటించే రోజు దగ్గర్లోనే ఉందేమో అని ఇద్దరి కామన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. జక్కన్న డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు.. ఆ సినిమాలో హీరోయిన్ ను మేకర్స్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.. దీపికా కూడా మహేష్ తో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుందని తెలుస్తుంది.. అయితే ప్రభాస్ పక్కన ఉన్నా కూడా ఇలా వేరే హీరో పేరు చెప్పడం ఏంటని ట్రోల్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.. మరి ఈ వార్తల పై దీపికా లేదా ప్రభాస్ ఎవరన్నా స్పందిస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు