Prabhas: కన్నప్ప మూవీలో ప్రభాస్ చేసే పాత్ర ఇదే, ఎన్ని నిమిషాలు కనిపిస్తారంటే.?

Prabhas: ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాస్ లో కన్నప్ప సినిమా ఒకటి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఈ సినిమాను మంచు ఫ్యామిలీ నిర్మిస్తుండటం ఈ సినిమాలో మంచు విష్ణు నటిస్తుండడం కారణాలు. అయితే ఇవి చాలామందికి ఇవి పెద్ద కారణాలా అని అనిపించొచ్చు. రీసెంట్ టైమ్స్ లో ఈ ఫ్యామిలీ చేస్తున్న ఏ సినిమా కూడా సరైన ఆదరణ లభించలేదు. మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకి కేవలం ఒక థియేటర్లో రెండంటే రెండు టికెట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జిన్నా సినిమా ఒక మాదిరిగా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు వీళ్ళు హై బడ్జెట్ తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇకపోతే మంచు విష్ణు మార్కెట్ తెలిసిందే కాబట్టి ఇంత భారీ బడ్జెట్ తన మీద పడితే వర్కౌట్ అవ్వదు అని తెలిసి మిగతా ఇండస్ట్రీలోని ప్రముఖులను కూడా ఈ సినిమాలు ఇంక్లూడ్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సాధించిన ప్రభాస్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. చాలామంది టాలీవుడ్ నటులతో పాటు బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి మంచు విష్ణు కంటే కూడా మిగతా నటులను చూడటానికి ఎక్కువ మంది వెళ్తారు అని చెప్పొచ్చు.

Manchu Vishnu

- Advertisement -

 

ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ ఏ పాత్రలో కనిపిస్తాడు అని అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది.కన్నప్ప మూవీలో శివుడి పాత్రలో ప్రభాస్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ, శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నారు. ఆ తర్వాత నందీశ్వర్ పాత్రలో చేస్తాడని ప్రచారం సాగింది. ఫ్యాన్స్ కూడా అందుకు ఫిక్స్ అయ్యారు.కానీ, ప్రభాస్ కన్నప్ప మూవీలో నందీశ్వర్ పాత్ర చేయ్యడం లేదు. నందీశ్వర్ పాత్రను మంచు మోహన్ బాబు చేస్తున్నాడు. కన్నప్ప మూవీలో ప్రభాస్ చేసే పాత్ర “రుద్ర” సినిమా మొత్తంలో దాదాపు 11 నిమిషాల పాటు ప్రభాస్ కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు