Vaishnavi Chaitanya : సిద్దు జొన్నలగడ్డ సినిమాలో వైష్ణవి చేసే పాత్ర ఇదే

Vaishnavi Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ నిలబడటం అనేది సాధారణమైన విషయం కాదు. కొంతమంది తెలుగు హీరోయిన్స్ వచ్చినా కూడా కొన్ని సినిమాలు చేసి కనుమరుగైపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని వాడుకొని మంచి కథలను ఎన్నుకొని కెరీర్లో ముందుకు వెళితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది వైష్ణవి చైతన్య. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ అనే సినిమాలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది.

Vaishnavi Chaitanya

వైష్ణవికి వరుస అవకాశాలు

బేబీ సినిమా తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు వచ్చాయి. రీసెంట్గా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది వైష్ణవి. వైష్ణవి ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. సిద్దు జొన్నలగడ్డ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. గుంటూరు టాకీస్ అనే సినిమాతో తనలో ఉన్న రైటర్ ను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సిద్దు రాసిన ఎన్నో సినిమాలు డీసెంట్ హిట్ అనిపించి ఉన్నాయి తప్ప బ్రేక్ ఇవ్వలేదు.

- Advertisement -

టిల్లు సినిమాతో 100 కోట్లు మార్కెట్

సిద్దు రాసిన మరో సినిమా టిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. సిద్దు జొన్నలగడ్డకి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా టిల్లు సినిమా కంటే కూడా పెద్ద హిట్ అయింది దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో హీరోగా ఒక సినిమాను చేస్తున్నాడు సిద్దు. ఒకప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అంటే ఇది సిద్దు సక్సెస్ కి నిదర్శనం.

ఈ సినిమాలో వైష్ణవి పాత్ర

బేబీ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూస్ లో వైష్ణవి మాట్లాడుతూ నేను పక్కా తెలంగాణ అమ్మాయిని అంటూ చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో భాస్కర్ దర్శకత్వంలో సిద్దు నటిస్తున్న సినిమాలో వైష్ణవి తెలంగాణ ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని తెలుస్తుంది. అయితే వైష్ణవి పర్ఫామెన్స్ తో పాటు స్వతహాగా తెలంగాణ స్లాంగ్ మీద ఒక పట్టు ఉంటుంది కాబట్టి ఈ సినిమాకి వైష్ణవిని సెలెక్ట్ చేసి ఉంటారు అని కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు