Harom Hara : ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు… వాడుకుంటాడా మరి?

Harom Hara : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే ఈ హీరో, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి కూడా చాలా టైం అవుతుంది. అప్పుడెప్పుడో సమ్మోహనం సినిమాతో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు మళ్ళీ మంచి చిత్రాలు ఎన్నో చేసినా ఆశించిన హిట్ మాత్రం దక్కలేదు. ఇక “సుదీర్ బాబు” ఓ మంచి హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తుండగా, లాస్ట్ ఇయర్ వచ్చిన మామా మశ్చ్చింద్ర కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకోగా, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపలేదు. కానీ ఇప్పుడు తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్న హరోం హర (Harom Hara) సినిమా డీసెంట్ అంచనాల నడుమ ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హరోం హర సినిమా జూన్ 14 న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

This week is a good chance for Harom Hara movie

భారీ అంచనాలతో విడుదలవుతున్న హరోం హర..

ఇక హరోం హర సినిమా ట్రైలర్ సినిమా మీద మంచి క్రేజీ అంచనాలను అయితే ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉండటంతో ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక జ్ఞానసాగర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుమంత్ నాయుడు నిర్మించడం జరిగింది. ఇక సినిమాకి ఇప్పుడు మంచి హిట్ అయ్యి సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ ని ఇచ్చే అవకాశం ఎంతైనా ఉండగా, లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మనమే క్లాస్ మూవీ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇక ఈ సినిమా కూడా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయింది కూడా. అలాగే ఇక ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా సైతం రావడానికి ఇంకా 2 వారాల టైం ఉండటంతో, ఈ గ్యాప్ లో రిలీజ్ అవుతున్న నోటబుల్ మాస్ మూవీ హరోం హర సినిమానే అవ్వడం, అలాగే ఈ సినిమాకి డీసెంట్ బజ్ కూడా ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అవ్వడానికి, అలాగే సుధీర్ బాబు కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

- Advertisement -

ఇంతకన్నా మంచి టైం లేదు..

ఇక సుదీర్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర హరోం హర (Harom Hara) సినిమాతో ఇప్పుడు ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అన్నది ఆసక్తిగా మారగా, ఈ సినిమాకి కనుక టాక్ కూడా ట్రైలర్ రేంజ్ లో బజ్ ను మ్యాచ్ చేసే విధంగా టాక్ గనుక పాజిటివ్ గా వస్తే కల్కి వచ్చే వరకు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక హరోం హర సినిమాని నైజాం లో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా, పలు చోట్లలో నిర్మాతలు ఓన్ రిలీజ్ కూడా చేస్తున్నారు. ఇక హరోం హర సినిమాకి పోటీగా వస్తున్న సినిమాలపై కూడా పెద్దగా అంచనాలు లేకపోగా, అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. అది హరోం హరకి ప్లస్ పాయింట్ అని, ఇంత కన్నా మంచి ఛాన్స్ దొరకదని చెప్పాలి. మరి సుదీర్ బాబు ఈ అవకాశాన్ని ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు