Tholi Prema: ప్రేమకథలు ఎన్ని వచ్చిన తొలిప్రేమ స్థాయి వేరు, స్థానం వేరు

Tholi Prema: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక ప్రేమ కథ సినిమాలో ప్రస్తావన వస్తే వాటిలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ముందే ఉంటుంది. కరుణాకర్ దర్శకుడిగా పరిచయమని ఈ సినిమా ఒక క్లాసిక్. పవన్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ ఆటిట్యూడ్, పవన్ కళ్యాణ్ స్టైల్ ఇవన్నీ కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. స్వచ్ఛమైన ప్రేమ కథ సినిమాకి అద్భుతమైన అర్థం చెప్పిన సినిమా ఇది. కేవలం ప్రేమ కథ చిత్రాలు అంటేనే యూత్ కి మాత్రమే దగ్గర అయ్యేవి అని కాకుండా ఫ్యామిలీ అంతా కూడా చూడగలిగే సినిమా ఇది.

తొలిప్రేమ కథ

జీవితంలో ఏ లక్ష్యం లేని ఓ మధ్య తరగతి యువకుడు బాలు (పవన్ కళ్యాణ్). స్నేహితులతో జులాయిగా తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటాడు. పెద్ద కుటుంబానికి చెందిన అను (కీర్తి రెడ్డి) ఒక విమాన ప్రమాదంలో తన తల్లిదండ్రులను కోల్పోవటంతో హైదరాబాదులో తన తాత గారి ఇంటికి వస్తుంది. జీవితంలో యౌవ్వన దశలో ఉన్నన్ని శక్తిసామర్థ్యాలు మరే దశలోనూ ఉండవని, ఏదన్నా సాధించేందుకు యవ్వనమే సరైన అవకాశమని గట్టిగా నమ్మే వ్యక్తి అను. ఇతరులకి సాయపడే వారిని అభినందించే ఉద్దేశ్యంతో వారి ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తూ ఉంటుంది అను. దీపావళి రోజున మతాబులు విరజిల్లే వెలుగులో పసిడి ఛాయలో మెరిసిపోతున్న అను అందానికి పడిపోతాడు బాలు. అనుని కలవాలని, తనతో మాటాడాలని ట్రై చేస్తున్న బాలుకి ఒకసారి ఆలయంలో, మరొక సారి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కనిపించి తృటిలో తప్పి పోతుంది అను.

Tholi Prema

- Advertisement -

ఒక రోడ్డు ప్రమాదంలో తన ప్రాణాలని సైతం లెక్క చెయ్యకుండా ఓ పసి పాపను రక్షిస్తాడు బాలు. అది చూసిన అను తన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది కాని, విఫలం అవుతుంది. తన చెల్లెలు ప్రియ (వాసుకి) ద్వారా అనుని కలుస్తాడు బాలు. అను పైన ప్రేమని పెంచుకున్న బాలు తన ప్రేమ గురించి చెప్పాలని అనుకుంటాడు. కాని చెల్లెలి సలహా మేరకు అనుతో ముందు స్నేహాన్ని పెంచుకోవటానికి నిర్ణయించుకుంటాడు. ఊటీ వెళుతున్న అను కారు ప్రమాదానికి గురి అవుతుంది. ఆ ప్రమాదంలో లోయలో పడుతున్న అనుని రక్షించి తాను లోయలో పడతాడు బాలు. వారి ప్రేమ ఫలించిందా లేదా అనేది కథ.

మొదటి సినిమాతోనే కరుణాకర్ దర్శకుడుగా ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. రోజులు మారుతున్న కొద్దీ ఎన్ని లవ్ స్టోరీలు వచ్చినా కూడా తొలిప్రేమ స్థానానికి ఉండే ఆ స్టేటస్ ఎప్పటికీ ఉంటుంది. పవన్ కెరియర్ లో వచ్చిన టాప్ లవ్ స్టోరీస్ లో తొలిప్రేమ ఒకటి నేటికీ ఈ సినిమా రిలీజ్ 26 ఏళ్లు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు