Thug Life : వేగం పెంచిన లవ్ గురు

Thug Life : మణిరత్నం ను చాలామంది తెలుగు ప్రేక్షకులు ముద్దుగా లవ్ గురు అని పిలుచుకుంటారు. మణిరత్నం ఎన్ని జోనర్స్ లో సినిమా చేసినా కూడా మణిరత్నం చేసిన లవ్ స్టోరీస్ కు మాత్రమే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. లవ్ స్టోరీ ని అంత అద్భుతంగా చూపిస్తాడు మణి రత్నం. ఇకపోతే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాని తెలుగు గాడ్ ఫాదర్ గా చాలామంది పరిగణిస్తారు. కమల్ హాసన్ నటించిన సినిమా ఎప్పటికీ ఎవరి గ్రీన్. ఆ సినిమా తర్వాత మళ్లీ వారి కాంబినేషన్లో సినిమా రావడానికి 37 ఏళ్లు పట్టింది. ప్రస్తుతం థగ్ లైఫ్ అనే సినిమాను చేస్తున్నాడు మణిరత్నం.

Thug Life

చాలా ఏళ్లు తర్వాత కమలహాసన్ సినిమా చేయడంపై స్పందిస్తూ “కమల్ హాసన్ తో మరో సినిమా తీసేందుకు 37 ఏళ్లు పట్టింది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఆయన ఒకరు. చిన్న కథలను ఆయనతో తీయకూడదు. తన స్థాయికి తగిన కథ ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని సంప్రదించాలి. ఇప్పుడు మేము ‘థగ్ఎఫ్’తో మరోసారి చరిత్ర సృష్టించనున్నాం. కొన్ని కథలకు కొత్తవాళ్లు అయితేనే బాగుంటుంది. అందుకే కొత్త హీరోలతో సినిమాలు చేస్తాం. నేను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సినిమాలు చేయలేదు. నా కథకు అవసరం కాబట్టే కొత్త వారికి అవకాశమిచ్చాను’ అని తెలిపారు.

- Advertisement -

ఇక ప్రస్తుతం కమల్ హాసన్ తో చేస్తున్న ఈ థగ్ లైఫ్ సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు నటిస్తున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తయిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. కేవలం 40 శాతం మాత్రమే ఇంకా మిగిలింది. ఎంతమంది పెద్ద స్టార్స్ తో ఈ సినిమాను ఇంత త్వరగా పూర్తి చేయటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా మిగతా షెడ్యూల్ ను కేరళలో చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు