Tillu Square : ఒకే ఒక్క అడుగు దూరంలో “గీత గోవిందం” ని మిస్ అయిన “టిల్లు స్క్వేర్”..

Tillu Square : టాలీవుడ్ లో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో భారి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా “టిల్లు స్క్వేర్”. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా సమ్మర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా టిల్లు స్క్వేర్ (Tillu Square) మొదటి రోజు నుండి కలెక్షన్స్ పరంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో ఊహకందని వసూళ్ళని సొంతం చేసుకోవడమే కాదు, టైర్ 2 హీరోల పరంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాను నాగ వంశి నిర్మించిన విషయం తెలిసిందే. ఇక టిల్లు స్క్వేర్ పార్ట్ వన్ కి, అలాగే రెండో పార్ట్ కి కూడా కథ సిద్ధూ జొన్నలగడ్డే అందించడం విశేషం. ఇక మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా స్టార్ హీరోల లెవెల్లో భారీ కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా నైజాంలో అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టి స్టార్ హీరోలకి సైతం షాకిచ్చింది.

ఒక్క అడుగుదూరంలో గీత గోవిందం మిస్..

ఇక టిల్లు స్క్వేర్ టోటల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 69 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా జస్ట్ లో సినిమా టైర్ 2 హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను మిస్ చేసుకుంది. టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరంగా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసింది. 2018 టైంలో వచ్చిన ఆ సినిమా టోటల్ రన్ లో ఏకంగా 70.50 కోట్ల మమ్మోత్ షేర్ ని అందుకుని టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక ఆ తర్వాత ఎన్నో క్రేజీ సినిమాలు ఈ రికార్డులు బ్రేక్ చేస్తాయి అనుకున్నారు కానీ కుదరలేదు. విజయ్ దేవరకొండ కూడా దీని దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఏ వచ్చిన ఏ సినిమా కూడా గీత గోవిందం సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయలేక పోయింది. కానీ సీక్వెల్ హైప్ తో వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో జోరు చూపించగా ఆల్ మోస్ట్ గీత గోవిందంని ఇక బ్రేక్ చేస్తుంది అనుకున్నా కూడా, మొత్తం మీద జస్ట్ లో 1.50 కోట్ల దూరంలో గీత గోవిందం రికార్డ్ ను మిస్ చేసుకుని టైర్2 హీరోల పరంగా ఆల్ టైం టాప్ 2 షేర్ మూవీగా నిలిచింది.

Tillu Square missed Geetha Govindam's record by just 1 crore

- Advertisement -

త్వరలో ఈ సినిమాలు బ్రేక్ చేసే ఛాన్స్?

ఇక టిల్లు స్క్వేర్ (Tillu Square) మార్చి ఎండ్ లో కాకుండా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన ప్లేస్ లో రిలీజ్ అయ్యి ఉంటే బహుశా గీత గోవిందంని క్రాస్ చేసి ఉండేది అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. అయినా ఇప్పటికీ గీత గోవిందం రికార్డ్ అలానే ఉండగా ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ఈ ఇయర్ లో మీడియం రేంజ్ సినిమాల్లో భారీ అంచనాలతో రాబోతున్న సరిపోదా శనివారం, తండేల్ సినిమాలకు ఈ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే లాంగ్ రన్ వీలైతేనే ఈ రికార్డ్ అందుకునే చాన్స్ ఉంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు