Time Bad Movies: రాంగ్ టైంలో రిలీజ్.. అట్టర్ ఫ్లాప్ అయిన చిత్రాలివే..!

Time Bad Movies.. సాధారణంగా డైరెక్టర్ అంటే కేవలం కథను అద్భుతంగా తెరపై చూపించడమే కాదు దాని వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. ముఖ్యంగా కథను ఎలా సిద్ధం చేయాలి? స్క్రీన్ ప్లే ఎలా రాసుకోవాలి? షూటింగ్ ఎప్పుడు చేయాలి ? ఎలా చేయాలి? ఎలాంటి నటులను తీసుకుంటే ఆ పాత్రకు న్యాయం చేస్తారు? సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి ? విడుదల చేయడం కోసం ప్రమోషన్స్ ఏ విధంగా చేపట్టాలి?.. అసలు సినిమాను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశాలపై కచ్చితంగా పట్టు ఉండాలి… అప్పుడే ఆ సినిమా అనుకున్న దాని కంటే ఎక్కువగా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది.. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అలాంటి పరిస్థితుల్లో సినిమాని రాంగ్ టైం లో విడుదల చేస్తే.. ఇక మంచి సినిమా అయినా సరే డిజాస్టర్ గా మిగలాల్సిందే. అందుకే సినిమా తీయడమే కాదు విడుదల చేయడం కూడా తెలిసి ఉండాలి.. అందులో సరైన సమయంలో విడుదల చేయడం అనేది కచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే అలా మంచి కథలైనా సరే రాంగ్ టైంలో రిలీజ్ చేసి అట్టర్ ఫ్లాప్ ను మూటగట్టుకున్నాయి.. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Time Bad Movies: Released at the wrong time..!
Time Bad Movies: Released at the wrong time..!

డెవిల్:

బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం డెవిల్ : ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ఈ సినిమా సలార్ సినిమాకి , సంక్రాంతి సినిమాలకు మధ్య ఎటు కానీ టైంలో విడుదలై ఘోర పరాభవాన్ని చవిచూసింది.. ఒకవేళ దసరా హాలిడేస్ లో లేదా సంక్రాంతికి గనుక విడుదల చేసి ఉండి ఉంటే… కచ్చితంగా దీని ఫలితం మరోలా ఉండేది అని చెప్పవచ్చు.

టైగర్ నాగేశ్వరరావు :

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. అయితే ఈ సినిమా అటు విజయ్ లియో.. ఇటు బాలకృష్ణ భగవంత్ కేసరి వంటి సినిమాలు విడుదలైన సమయంలో ఈ సినిమాను విడుదల చేసి డిజాస్టర్ గా నిలిచింది.

- Advertisement -

సైంధవ్:

వెంకటేష్ 75వ చిత్రంగా భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలయ్యింది.అయితే ఈ సినిమా కంటెంట్ బాగానే ఉన్నా రాంగ్ టైంలో రిలీజ్ చేసి డిజాస్టర్ పాలయ్యింది. సంక్రాంతి పండుగకు పోటీపడినా అక్కడ కాంపిటీషన్ తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయింది.. ఒకవేళ ఈ సినిమా ఏదైనా పండుగల సమయంలో విడుదల చేసి ఉంటే కచ్చితంగా హిట్టు కొట్టేది భారీ బడ్జెట్ చిత్రాల మధ్య ఈ సినిమా నిలువలేకపోయింది.

అంటే సుందరానికి:

నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం అంటే సుందరానికి.. మరోవైపు హీరోయిన్ నజ్రియా కూడా చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది . అయితే ఈ సినిమా విడుదల సమయంలో.. అడివి శేషు నటించిన మేజర్ చిత్రం, కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలకు మధ్యలో విడుదల అయింది .. పైగా ఈ చిత్రం సమయంలో వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో చాలా మంది థియేటర్ కు వెళ్లలేక పోయారు.. ఫలితంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు