Pawan Kalyan: పవన్ నాలుగో వివాహానికి టైం ఫిక్స్.. వేణు స్వామి కామెంట్స్ వైరల్..!

Pawan Kalyan: ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాల్లో ఫుల్ బిజీ లైఫ్ని కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అనంతరం పాలిటిక్స్ లో కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఇక సినిమాలు చేసినంత కాలం చాలా కామ్ గా ఉన్న ఈయన జీవితం.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత అనేక కలహాలతో రెచ్చిపోయాయి.

ఆపోజిట్ పార్టీ వాళ్లు పవన్ కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి అంటూ తీవ్రంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇక వీటిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ పలుమార్లు కంటతడి పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ నాలుగో వివాహం కూడా చేసుకుంటాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతకం ప్రకారం మరోసారి వివాహం తప్పదని అన్నారు. అది కూడా 2024లో అంటున్నారు. పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత జీవితంలో భాగం.

Time fix for Pawan's fourth marriage.. Venu Swamy's comments go viral
Time fix for Pawan’s fourth marriage.. Venu Swamy’s comments go viral

జాతకం ప్రకారం ఈ ఏడాది చివరిలో నాలుగో పెళ్లి చేసుకుంటారని వేణు స్వామి అంచనా వేశారు. అదేవిధంగా ఏపీ సీఎం ఎవరో కూడా ఆయన జాతకరీత్యా వెల్లడించారు. 2024లో వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అవుతారు అని వేణు స్వామి అంచనా వేశారు. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సీఎం అయ్యే అవకాశం లేదన్నారు. వీరిద్దరి జాతకాలు బాగాలేదు.. అందుకే వీరిద్దరూ 2024లో సీఎం అవ్వలేరు.. అంటూ వేణు స్వామి బాంబు పేల్చారు. ప్రజెంట్ వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు