Kamal Haasan : కమల్‌కు భయపెట్టడం కొత్తేమీ కాదు.. కల్కితో పాటు విలన్‌గా చేసిన సినిమాలివే..!

Kamal Haasan: స్టార్ హీరో కమల్ హాసన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలనటుడి స్థాయి నుంచి విశ్వనటుడిగా ఎదిగినటువంటి కమలహాసన్ ఇండియన్ సినిమాకి ఒక పెద్ద వరం. ఈ మల్టీ టాలెంటెడ్ హీరో తన కెరీర్ లో ఇప్పటివరకు 230కి పైగా సినిమాల్లో నటించారు. మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ సినిమాల్లో నటించి కోట్లాదిసంఖ్యలో అభిమానులను అలరించారు. అంతేకాకుండా కమల్ హాసన్ తన అద్భుతమైన నటనకుగాను నాలుగు సార్లు నేషనల్ ఫిల్మ్ అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా మరెన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

ఇక రీసెంట్ గానే కమల్ హాసన్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి “కల్కి 2898 ఏడీ” సినిమాలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ఇంకా మరెందరో స్టార్ నటీనటులు కలిసి ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కమలహాసన్ తన నటనతో మెప్పించారు. ఇక మరికొద్ది రోజుల్లోనే అంటే జూలై 12వ తేదీన ఇండియన్ టు సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కమలహాసన్ కథానాయకుడిగా కనిపించనున్నారు. అయితే కొన్ని ఇంగ్లీష్ మీడియా కథనాలు ప్రకారం కమలహాసన్ ఆస్తులకు సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో కమల్ హాసన్ నటించారు. ఎన్నో సినిమాల్లో నటించిన కమలహాసన్ ఆస్తులు భారీగానే సంపాదించినట్టు టాక్ వినిపిస్తోంది. సుమారు రూ. 450 కోట్లకు పైగా కమలహాసన్ ఆస్తులు ఉన్నాయట. ఇక కమలహాసన్ సినిమాలో నటించినందుకు తీసుకునే రెమ్యూనరేషన్ తో పాటుగా తమిళ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ నిర్మాతగా ….అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కమలహాసన్ వ్యవహరిస్తూ భారీగానే డబ్బులను సంపాదిస్తున్నారు. ఇక ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ నటించినందుకు ఏకంగా రూ. 150 కోట్ల వరకు డిమాండ్ చేసి మరీ రెమ్యూనరేషన్ భారీగా తీసుకున్నారట.

- Advertisement -

అయితే కమల్‌ హాసన్‌ ఇప్పటివరకు విలన్‌ గా చేసిన సినిమాల లిస్ట్‌ ఓసారి పరిశీలిద్దాం.

‘సిగప్పు రోజక్కల్’

సైకలాజికల్ థ్రిల్లర్ ‘సిగప్పు రోజక్కల్’ సినిమాను దర్శకుడు భారతీ రాజా తెరకెక్కించారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌ గా చేశారు. ఈ చిత్రం 1978లో విడుదలైంది. కమల్ హాసన్ దిలీప్ పాత్రను పోషించారు. ఇందులో కమల్ హాసన్ తన నెగిటివ్ రోల్‌తో అభిమానులను ఉర్రూతలూగించి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు.

‘భారతీయుడు’

శంకర్ దర్శకత్వం వహించిన దేశభక్తి సినిమా ‘ఇండియన్’. ఈ సినిమాలో కమల్ హాసన్… తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం వీరిద్దరి కలయికలో మొదటిది. ఇందులో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర, అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారి పాత్రలో కమల్‌ కనిపిస్తారు. ఈ సినిమా బంపర్‌ విజయాన్ని అందుకుంది.

‘ఆళవంధన్’

సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా ‘ఆళవంధన్’. కమల్ హాసన్ విలన్‌ గా నటించిన ఈ చిత్రం 2001లో థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించారు.

‘దశావతారం’
కమల్ హాసన్, కెఎస్ రవికుమార్ కాంబోలో చాలా సినిమాలు వచ్చి.. సక్సెస్‌ అయ్యాయి. ఈ తరుణంలోనే… మెగా-బడ్జెట్ తో ‘దశావతారం’ సినిమా వచ్చి బంపర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ పది విభిన్న పాత్రలను పోషించాడు. విభిన్న కాలాలు, నేపథ్యాలను కలిగి ఉన్న వివిధ పాత్రలలో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు. కమల్ హాసన్ ‘దశావతారం’లో ఫ్లెచర్‌గా స్టైలిష్ విలన్ పాత్రను పోషించాడు. ముఖ్య విలన్‌ కూడా ఈ సినిమాలో కమలే.

Kamal Hassan: Interesting Comments on Kamal Hassan's Reaction After Watching Kalki, Part 2

‘కల్కి 2898 AD’
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన పాన్-ఇండియన్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది కల్కీ. హిందూ దేవత విష్ణువు అవతారాన్ని వివరించే ఫాంటసీ డ్రామాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ విలన్‌ గా చేశాడు. మొదటి పార్ట్‌ లో చాలా తక్కువ సేపు స్క్రీన్ కనిపించినప్పటికీ, అతను తన బలమైన పాత్ర ద్వారా సీక్వెల్‌ను శాసించబోతున్నాడు.

ఇంద్రుడు చంద్రుడు

ఇంద్రుడు చంద్రుడు సినిమా 1989లో విడుదలై బ్లాక్‌ బాస్టర్‌ గా నిలిచింది. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ హాసన్ , విజయశాంతి, చరణ్ రాజ్ నటించారు. ఇందులో కూడా కమల్‌ డ్యూయల్‌ రోల్‌ చేయడమే కాకుండా.. విలన్‌ గా కూడా చేశారు.

సొల్లత్తన్ నినైక్కిరేన్

సొల్లత్తన్ నినైక్కిరేన్ సినిమాలో 1974 లో వచ్చింది. ఈ సినిమాకు కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. ఇందులో కూడా కమల్‌ హాసన్‌ విలన్‌ గా చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు