JonLondau Passes Away : హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ‘టైటానిక్’ నిర్మాత మృతి..

JonLondau Passes Away : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ చిత్రాల నిర్మాత “జాన్ లాండౌ” (63) శనివారం మృతి చెందారు. హాలీవుడ్ లో భారీ చిత్రాలు నిర్మించిన ఈయన కొంతకాలం నుండి అనారోగ్యం తో బాధపడుతుండగా, శనివారం నాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన సన్నిహితులు మీడియా ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక అయన మృతికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయి. హాలీవుడ్ లో అవతార్, టైటానిక్ వంటి గ్రాండియర్ చిత్రాలను నిర్మించిన జాన్‌ లండౌ గత కొంతకాలంగా క్యాన్సర్‌ తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా జాన్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి.

Titanic Producer JonLondau Passes Away

ఆస్కార్ రేంజ్ చిత్రాలు నిర్మించిన జాన్ లాండౌ…

హాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ అయిన జాన్ లాండౌ (JonLondau Passes Away) పలు భారీ చిత్రాలను నిర్మించారు. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు టైటానిక్, అవతార్ వంటి సినిమాలు నిర్మించింది ఈయనే. ఆ సినిమాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ తో కలిసి జాన్ లాండౌ ఈ చిత్రాలను నిర్మించగా, ఈ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణను పొందడమే కాక, పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. ఇవే కాక సోలారిస్, ‘అలిట : బ్యాటిల్ ఏంజిల్’ వంటి చిత్రాలను కూడా నిర్మించారు. కెరీర్ లో ఇప్పటివరకు 8 సినిమాలు మాత్రమే నిర్మించిన ఈయన తక్కువ చిత్రాలతోనే మంచి ప్యాషన్ కలిగిన ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక టైటానిక్, అవతార్, అవతార్2 సినిమాలు ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.

- Advertisement -

రాబోయే ప్రాజెక్ట్స్ ని కూడా ఈయనే నిర్మాత..

ఇక 1980 ల్లో ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన జాన్ లాండౌ, జేమ్స్ కామెరూన్ తో కలిసి టైటానిక్ తో ప్రొడ్యూసర్ అయ్యాడు. జాన్ లాండౌ కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారే జేమి, జూడి. ఇక ఈయన నిర్మించిన టైటానిక్ సినిమా 11 ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుంది. అయితే జోన్‌ లాండౌ చివరగా నిర్మించిన అవతార్‌ సిరీస్‌లో మూడో భాగం 2026లో, అలాగే నాలుగో పార్ట్ 2030లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన వారసులు ఈ సీక్వెల్ సినిమాల బాధ్యతలను చేపట్టనున్నట్టు సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు