Tollywood: బైక్ యాక్సిడెంట్.. 23 సర్జరీలు.. నాలుగేళ్లు మంచానికే పరిమితం.. కట్ చేస్తే ..!

Tollywood.. దక్షిణాది సినీ పరిశ్రమలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఒక సీనియర్ స్టార్ హీరో తెలుగు , తమిళ్ భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు పోషించి , అందరిలో కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న ఒక హీరో వయసు ప్రస్తుతం 58 ఏళ్లు. అయినా సరే 28 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు దీటుగా వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ హీరో నటనకు, ఆటిట్యూడ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచి నటన పైన ఎంతో ఇష్టం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నింటిని అధిగమించి మరీ భారీ క్రేజ్ దక్కించుకున్నారు.

Tollywood: Accident.. 23 surgeries.. Confined to bed for three years.. If cut..!
Tollywood: Accident.. 23 surgeries.. Confined to bed for three years.. If cut..!

12 యేళ్ళ వయసులోనే బైక్ ఆక్సిడెంట్..

ఇకపోతే చిన్న వయసులోనే ఘోరమైన బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు. నాలుగేళ్లు వీల్ చైర్కే పరిమితమయ్యి, నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించారు. కాళ్ళను కాపాడుకోవడానికి ఏకంగా 23 సర్జరీలు కూడా చేయించుకున్నారు.. కుడి కాలు తీసేయాలని చెప్పినా ఎంతో కష్టపడి తనను తాను బలోపేతం చేసుకున్నారు.. వీడని విక్రమార్కుడిలా ఆత్మస్థైర్యంతో నిలబడి హీరోగా మారి, కోట్లాదిమంది అభిమానుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయనే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.

చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీ..

1966 ఏప్రిల్ 17న జన్మించారు విక్రమ్. ఈయన తండ్రి జాన్ విక్టర్ (వినోద్ రాజ్) క్రిస్టియన్, ఈయన తల్లి రాజేశ్వరి హిందూ.. విక్రమ్ చియాన్ తండ్రి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించేవారు. ఈయన తల్లి ప్రభుత్వ ఉద్యోగి.. విక్రమ్ సోదరుడు అరవింద్ తమిళ చిత్రం ఎప్పో కళ్యాణం సినిమాలో కనిపించగా, అతని సోదరి అనిత టీచర్. ఏర్కాడ్ మోంట్ ఫోర్ట్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈయన 1983లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.. పాఠశాలలో వున్నప్పుడే గుర్రపు స్వారి , స్విమ్మింగ్ ట్రైనింగ్ , కరాటే వంటివి నేర్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి రావాలనుకున్న సమయంలో తండ్రి చదువు పూర్తి చేయాలని ఆదేశించాడు. దీంతో ఎంబీఏ పూర్తి చేసిన విక్రమ్ , చెన్నైలోని లయోలా కాలేజ్ నుంచి ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి పట్టా అందుకున్నారు. ఇక తర్వాత తండ్రి ఆదేశాలను పాటించిన ఈయన ఆ తర్వాత 1990లో ఎన్ కాదల్ కన్మణి చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ్, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

- Advertisement -

కాలు తీసేయాలన్నారు.. 23 సర్జరీలు కూడా..

ఇకపోతే 2003లో పితామగన్ చిత్రంలో ఈయన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. విక్రమ్ 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక సినిమాలో మూగ అబ్బాయి పాత్ర ఆఫర్ వచ్చింది. ఆ పాత్ర కోసం అతనికి ఐఐటి మద్రాస్ లో ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో అవార్డు ప్రధానోత్సవం తర్వాత స్నేహితుడితో కలిసి వస్తున్నప్పుడు ఘోరమైన బైక్ ఆక్సిడెంట్ జరిగిందట. ఆ ఘటనలో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డమే కాదు కుడికాలును తీసేయాలని వైద్యులు సూచించారట. కానీ అందుకు అతడి తల్లి ఒప్పుకోలేదు. ప్రమాదం తర్వాత నాలుగేళ్లు వీల్ చైర్కే పరిమితమయ్యాడు. కుడికాలు పూర్తిగా గాయపడింది.. చీలమండ నుంచి మోకాలి వరకు ఎముకలు విరిగి చర్మం కంది పోయిందని అందుకే కాల్ తీసేయాలని చెప్పారట.. అయితే అలా తీసేయకుండా ఏకంగా 23 సర్జరీలు చేయించారట విక్రం తల్లి.. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విక్రమ్ కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు