Singham Again : సింగం లో టాలీవుడ్ విలక్షణ నటుడు.. బ్రేక్ వేస్తుందా?

Singham Again : బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన సింగం సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సింగం మూవీ హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరుస ప్లాపుల్లో ఉన్న అజయ్ దేవగణ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ పై తన సత్తా చాటేలా చేసింది ఆ సినిమా. ఆరోజుల్లోనే 120 కోట్లు కొల్లగొట్టి ఖాన్ త్రయానికి పోటీనిచ్చాడు అజయ్. ఇక ఈ సినిమా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘యముడు’ మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇక హిందీలో ఫస్ట్ పార్ట్ వచ్చిన మూడేళ్లకు సీక్వెల్ ‘సింగం రిటర్న్స్’ తెరకెక్కింది. ఈ సీక్వెల్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా అజయ్ వన్ మ్యాన్ షో తో బాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి 250 కోట్లు కొల్లగొట్టింది. ఇక సింగం సిరీస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో డైరెక్టర్ రోహిత్ శెట్టి – అజయదేవగన్ కాంబో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆ మధ్య అక్షయ్ కుమార్ సూర్యవంశీ లో సింగం రోల్ తోనే స్పెషల్ గెస్ట్ రోల్ చేసాడు. ఇక ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకు సింగం ఫ్రాంచైజ్ నుండి మళ్ళీ సింగం అగైన్ అంటూ సినిమా వస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు కీలక పాత్రలో నటిస్తున్నట్టు తాజగా తెలిసింది.

Tollywood actor Ajay in a key role in Singham Again

సింగం అగైన్ లో అజయ్..

ఇప్పుడు రోహిత్ శెట్టి- అజయ్ దేవగన్ కాంబోలో వస్తున్న “సింగం ఎగైన్” పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఫస్ట్ రెండు పార్టులు భారీ విజయాలు సాధించడంతో. సింగం-3 బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారింది. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే అజయ్ దేవ్ గణ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ప్రేక్ష‌కుల‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. సింగం-3లో ఓ టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ యాక్ట్ చేస్తున్నట్టు తాజాగా రివీల్ అయింది. తెలుగులో చాలా చిత్రాల్లో మంచి స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ, అండర్ రేటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అనేక తెలుగు చిత్రాల్లో తన నటన తో ఆకట్టుకున్న నటుడు అజయ్ ఇప్పుడు సింగం-3లో పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. సింగం-3 షూటింగ్స్ సెట్స్ లో అజయ్ దేవ గణ్ తో అజయ్ దిగిన పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అజయ్ సూపర్ ఛాన్స్ కొట్టేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మూవీతో తన టాలెంట్ ను బాలీవుడ్లోనూ నిరూపించుకోవాలని సూచిస్తున్నారు. బీటౌన్ లో కూడా వరుస ఆఫర్లు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. మరి అజయ్ బాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

ఇదే ఏడాది సింగం అగైన్?

ఇక సింగం అగైన్ (Singham Again) సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొణె నటిస్తున్నారు. విలన్ గా అర్జున్ కపూర్ కనిపించనున్నాడని సమాచారం. అలాగే బాలీవుడ్ స్టార్ న‌టులు టైగ‌ర్ ష్రాఫ్, రణ్‌ వీర్ సింగ్, కరీనా కపూర్ తోపాటు అక్ష‌య్ కుమార్ స్పెష‌ల్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారట. ఇక ఈ మూవీ.. ఆగస్టు 15వ తేదీన విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ సినిమా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ ఉందట. పైగా పుష్ప ది రూల్ అదే రోజు విడుదల ఉండడంతో పోటీ ఎందుకని తప్పుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇదే ఏడాది దీపావళి కానుకగా సింగం అగైన్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఈ ఇయర్ సైతాన్ తో హిట్ కొట్టిన అజయ్ దేవగన్ సింగం అగైన్ తో మళ్ళీ తన సత్తా చాటుతాడా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు