Tollywood Actor: ఈ విలన్ గుర్తున్నాడా.. ఈయన భార్య, పిల్లలు కూడా స్టార్సే..!

Tollywood Actor..తెలుగులో, తమిళంలో ఎన్నో చిత్రాలలో హీరోగా,నటుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో రామ్ కీ. అయితే ఈ పేరు గుర్తుపట్టడం కష్టమే కానీ రీ ఎంట్రీలో RX -100 చిత్రంతో డాడీ అనే పేరుతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్రలో నటించారు రామ్ కీ.. వాస్తవానికి ఈయన అసలు పేరు రామకృష్ణ గా.. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత రామ్ కీగా మార్చుకున్నారట. ఈయన నటించిన చిత్రాలలో ఘటన, దోషి, భలే ఖైదీలు వంటి సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ఈయనకు హీరోగా పెద్దగా క్రేజ్ రాలేకపోయింది. అయితే ఈయన కెరియర్ ను మార్చింది సింధూరపువ్వు సినిమా అని చెప్పవచ్చు.

Tollywood Actor: Do you remember this villain.. His wife and children are also stars..!
Tollywood Actor: Do you remember this villain.. His wife and children are also stars..!

ఈయన భార్య ఎవరో కాదు నిరోష..

పలు చిత్రాలలో గెస్ట్ రోల్ లో కూడా కనిపించారు. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఈయన భార్య కూడా ఒక స్టార్ హీరోయిన్ అని చాలామందికి తెలియకపోవచ్చు.. ఈమె తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిరోష.. ఈమె రామ్ కీ భార్యేనట. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోల సరసన నటించిన నిరోషా దాదాపుగా తెలుగులో 30 కి పైగా సినిమాలలో నటించింది. తమిళంలో నూటికి పైగా చిత్రాలలో నటించిందట.

వరలక్ష్మి శరత్ కుమార్ తో రిలేషన్..

తమిళంలో అయితే నిరోషాకు అప్పట్లో భారీ క్రేజ్ ఏర్పడింది. తన అందంతో నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న నిరోషా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుంది. అలా నిరోష తో రామ్ కీ వివాహం 1995లో జరిగిందట. రామ్ కీ సోదరుడు కూడా స్టార్ హీరో గానే ఒక వెలుగు వెలిగారు. ఆయన ఎవరో కాదు శరత్ కుమార్. ఆయన కూతురే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా మొత్తానికి చూసుకుంటే రామ్ కీ కుటుంబ సభ్యులు మొత్తం కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళే గమనార్హం.

- Advertisement -

రీ యంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరిక..

రామ్ కీ అంటే తొందరగా ఎవరికి గుర్తుకు రాదు ఆర్ఎక్స్ 100 డాడీ అనగానే టక్కున అందరికీ గుర్తు వస్తుంది. ముఖ్యంగా శివ కి ఒక తండ్రి స్థానంలో ఉంటూ సినిమాలో చాలా కీలకపాత్ర పోషించాడు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ ఊరిలో ఒక పెద్ద మనిషిలా ముందుండి అన్నీ నడిపిస్తూ ఉంటాడు. ఇకపోతే ఈయన విజయశాంతి ఫినామినల్ మూవీ ఒసేయ్ రాములమ్మలో కూడా కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత మళ్లీ రెండు దశాబ్దాలు అసలు తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఉన్నట్టుండి మళ్లీ కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈయన ఏ మేరకు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు