Tollywood Movies : టాలీవుడ్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్.. ఏకంగా అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్టా..

Tollywood Movies : గత ఏడాదితో పోలిస్తే .. ఈ ఏడాది సినిమాల సందడి బాక్సాఫీస్ వద్ద కాస్త ఎక్కువగానే ఉంది.. ఈ ఏడాది మొదలుకొని సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. 2024 ఏడాది మొదలయి నేటితో ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఈ ఆరు నెలల్లో బాగానే సినిమాలు వచ్చాయి. ప్రతి ఏడాది సమ్మర్ పెద్ద సినిమాలతో బిజీగా ఉండే సినీ పరిశ్రమ థియేటర్లు, ఈ సారి ఎన్నికలు, ఐపీఎల్ తో ఖాళీగానే ఉంది. ఇక ఈ ఆరు నెలల్లో ఎన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ఎంత కలెక్షన్స్ రాబట్టాయి అనేది ఒక్కసారి ఈ ఆర్టికల్ ద్వారా గుర్తుచేసుకుందాం..

Tollywood Half Yearly Results.. All the movies are blockbuster hits together..
Tollywood Half Yearly Results.. All the movies are blockbuster hits together..

జనవరి :

జనవరిలో న్యూయర్ రోజున సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇస్తూ వచ్చిన సినిమా సర్కారు నౌకరి. ఇది ఎమోషనల్ గా ప్రేక్షకులని మెప్పించిన కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇదే కాదు అదే రోజున మరో మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. జనవరి 5న దాదాపుగా 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే సంక్రాంతి రేసులో జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్ సినిమాలు విడుదలై రెండు సినిమాలు భారీ హిట్స్ కొట్టాయి. గుంటూరు కారం సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తే, హనుమాన్ ఎవ్వరూ ఊహించని విధంగా 300 కోట్లు కలెక్ట్ చేసి 50 రోజుల లాంగ్ రన్ నడిచింది. జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజయింది. ఇది పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. జనవరి 14న నాగార్జున నా సామిరంగ రిలీజై డీసెంట్ హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ అయింది. జనవరి 26న హన్సిక 105 మినిట్స్ సినిమాతో పాటు 5 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఏ ఒక్క సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు..

- Advertisement -

ఫిబ్రవరి :

ఫిబ్రవరి నెలలో 2న సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ బూట్ కట్ బాలరాజు సినిమాలతో పాటు మరో 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ డీసెంట్ హిట్ నిలవగా మిగిలిన సినిమాలన్నీ అడ్రెస్ లేకుండా పోయాయి. ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ బయోపిక్ గా తెరెకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజయింది కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ సినిమా రిలీజవ్వగా యావరేజ్ గా నిలిచింది. ఫిబ్రవరి 15 అమరావతి రైతుల మీద తీసిన రాజధాని ఫైల్స్ రిలీజయింది. ఫిబ్రవరి 16న సుందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. అదే రోజు మరో చిన్న సినిమా రిలీజయింది. ఫిబ్రవరి 23న సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయి..ఈ సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకున్నాయి..

మార్చి:

మార్చ్ 1న భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఆపరేషన్ వాలెంటైన్, వ్యూహంతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాఅంతగా టాక్ ను అందుకోలేదు.. అలాగే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, వెన్నెల కిషోర్ చారి 111, ఆర్జీవీ వ్యూహంతో పాటు మిగిలిన సినిమాలు అన్ని పరాజయం పాలయ్యాయి. మార్చ్ 8 గామి, భీమలతో పాటు 4 చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. ఆ గామి సినిమా మంచి హిట్ అయింది. గోపీచంద్ భీమతో పాటు మిగిలిన సినిమాలు కూడా నిరాశ పరిచాయి. మార్చ్ 15న రజాకార్, లంబసింగి, షరతులు వర్తిస్తాయి.. వెయ్ దరువేయ్, తంత్రలతో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల్లో సరైన హిట్ టాక్ ను అందుకోలేదు .. ఇకపోతే మార్చ్ 22 ఓం భీం బుష్, లైన్ మ్యాన్ తో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజవ్వగా శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. మార్చ్ 29న సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా విడుదలై 175 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ టాక్ ను అందుకున్నాయి.

ఏప్రిల్:

ఇక ఏప్రిల్ 5న రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరోజున వచ్చిన మిగిలిన సినిమా బ్లారీ డిజాస్టర్ అయ్యాయి. ఏప్రిల్ 11న అంజలి గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది.. అదే విధంగా సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా నిరాశ పరిచింది. ఏప్రిల్ 12న 2 చిన్న సినిమాలు రిలీజయినా ఎవ్వరికి తెలియకుండానే వెళ్లిపోయాయి. ఏప్రిల్ 18న సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో చేసిన టెనెంట్ విడుదలై నిరాశ పరిచింది. ఏప్రిల్ 19 మార్కెట్ మహాలక్ష్మి, పారిజాతాపర్వం సినిమాలు విడుదలైయ్యాయి. కానీ ఫ్లాప్ అయ్యాయి.. ఏప్రిల్ 26 కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఒక్కరోజులోనే వెనక్కి వెళ్లాయి.

మే:

మేలో విడుదలైన సినిమాల విషయానికొస్తే.. మే 3న ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్న వదనం, శబరి సినిమాలు విడుదలైయ్యాయి.. సుహాస్ ప్రసన్న వదనం సినిమా కూడా బాగున్నా ఫ్లాప్ అయింది. మే 10 సత్యేదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2, మరో 3 చిన్న సినిమాలు రిలీజై అన్ని నిరాశ పరిచాయి. మే 17న వచ్చిన సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. మే 24 గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు విడుదలై అన్ని పరాజయం పాలయ్యాయి. అదే విధంగా మే 25న ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మి సినిమా విడుదలైంది.. కథ కొత్తగా ఉన్నా కూడా యావరేజ్ టాక్ ను అందుకుంది. మే 31న రిలీజయిన కార్తికేయ భజే వాయు వేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ఓ మాదిరి టాక్ ను అందుకున్నాయి.. సమ్మర్ లో సినిమాలు అంతగా విడుదల అవ్వలేదు.

జూన్:

జూన్ 7న నవదీప్ లవ్ మౌళి, శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ, పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమాతో పాటు మరో 4 చిన్న సినిమాలు విడుదల అయ్యి పరాజయం పాలయ్యాయి. జూన్ 14న సుధీర్ బాబు హరోం హర, చాందిని చౌదరి ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా బాగున్నా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. జూన్ 21న వరుణ్ సందేశ్ నింద, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ తో సినిమాలు విడుదలై ఫ్లాప్ అయ్యాయి. జూన్ 22న హెబ్బా పటేల్ సందేహం సినిమా ఫ్లాప్ గానే నిలిచింది. ఇక తాజాగా జూన్ 27న వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD సినిమా భారీ హిట్ కొట్టింది. ఇప్పటికే 400 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇక మళ్ళీ అక్టోబర్ , డిసెంబర్ నెలలో ఎక్కువగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. వాటి కోసం ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు