Tollywood Hero: ఫ్లాప్ లు తీయడానికి కూడా పోటీపడుతున్న యంగ్ హీరోలు వీళ్లే..!

Tollywood Hero..తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టైర్ -2 హీరోలకి పెద్దగా కలిసి రావడం లేదని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు తీస్తున్న ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలుస్తోంది. ముఖ్యంగా తాజాగా ఎదురవుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ టైర్ -2 హీరోలంతా కూడా ఫ్లాప్ ల కోసం పోటీ పడుతున్నారేమో అని అనుమానం కలగక మానదు మరి ఎవరెవరు ఇలా ఫ్లాప్ సినిమాలు తీస్తూ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారో ఇప్పుడు చూద్దాం.

Tollywood Hero: These are the young heroes who are also competing to make flops..!
Tollywood Hero: These are the young heroes who are also competing to make flops..!

విజయ్ దేవరకొండ..

అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల తరహాలో విజయ్ దేవరకొండ ( Vijay devarakonda)కు ఇప్పటివరకు సక్సెస్ లభించలేదని చెప్పాలి. ఒక అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ అయిపోయిన విజయ్ దేవరకొండ , ఆ తర్వాత తీసిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో సక్సెస్ లభించలేదు. ముఖ్యంగా టాక్సీవాలా చిత్రంతో పరవాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత తీసిన ద్వారక, ఏ మంత్రం వేసావే , ఈ నగరానికి ఏమైంది, డియర్ కామ్రేడ్, మీకు మాత్రమే చెప్తా, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలు ఘోర పరాభవాన్ని అందించాయి. పైగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ దర్శకత్వంలో లైగర్ సినిమాతో భారీ అంచనాల మధ్య ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్ల పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ఖుషి , ఫ్యామిలీ స్టార్ చిత్రాలు పర్వాలేదు అనిపించుకున్నాయి. కానీ సరైన సక్సెస్ మాత్రం ఈయన ఖాతాలో పడలేదు. మరి ఈయనకు ఏమైందో తెలియదు కానీ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతూ సక్సెస్ కోసం ఆరాటపడుతున్నారు.

నాగచైతన్య..

నాగచైతన్య (Naga Chaitanya)సినీ కెరియర్ లో ఒక్క కమర్షియల్ విజయం కూడా లేదు అనడంలో సందేహం లేదు. గతంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని అందుకుంది కానీ స్టార్ హీరో స్టేటస్ ను మాత్రం తెచ్చి పెట్టలేదు. ఇక తన తండ్రితో కలిసి నటించిన బంగార్రాజు సినిమా కూడా విజయం సాధించింది. ఇక తర్వాత తీసిన కస్టడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను చవి చేశారు నాగచైతన్య. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా విజయం సాధిస్తే నాగచైతన్య కెరియర్ కు డోకా ఉండదు. ఒకవేళ ఇది ప్లాప్ అయ్యిందంటే మాత్రం ఈయనకు అవకాశాలు రావడం కష్టమవుతుంది అని చెప్పవచ్చు.

- Advertisement -

రామ్ పోతినేని:

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రామ్ పోతినేని ( Ram pothineni)ఆ తర్వాత తీసిన రెడ్, వారియర్ , స్కంద ఇలా వరుసగా మూడు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్ పోతినేని. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది కనీసం రామ్ మార్కెట్ ను కూడా ఏ మాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా.

దీన్నిబట్టి చూస్తే టైర్ 2 కి చెందిన ఈ ముగ్గురు హీరోలు కూడా సక్సెస్ కోసం ఆరాటపడే సందర్భంలో ఇలా వరుస ఫ్లాప్ లు అందుకుంటూ, ఫ్లాప్ లు అందుకోవడంలో కూడా పోటీ పడుతున్నారు అనేలా ప్రవర్తిస్తున్నారు. మరి ఈ ముగ్గురికి ఎప్పుడు సరైన సక్సెస్ లభిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు