Tollywood Heroine: @ 8 ఏళ్ళు..ఆ సన్నివేశాలకు మాత్రం దూరం..!

Tollywood Heroine:.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అంతే పద్ధతిగా కనిపించి కేవలం అద్భుతమైన నటనతో, అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య అనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో సౌందర్య తర్వాత బోల్డ్ పాత్రలకు దూరంగా ఉన్నది మాత్రం సాయి పల్లవి మాత్రమే.. కానీ ఇక్కడ ఒక హీరోయిన్.. ట్రెండుకు తగ్గట్టుగా మారిపోయి కాస్త బట్టల సైజు తగ్గించిన విషయం తెలిసిందే.. కానీ ఏ రోజు కూడా శృతి నుంచి నటించలేదు అని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి వచ్చే దాదాపు 8 సంవత్సరాలకు పైగానే అవుతుంది. కానీ ఇప్పటివరకు ముద్దు సన్నివేశాలలో, రొమాన్స్ సన్నివేశాలలో కనిపించలేదు.. ట్రెండుకు తగ్గట్టుగా మారిపోవాలని ఎంతోమంది హీరోయిన్స్ ప్రయత్నాలు చేస్తున్నా.. ట్రెండుకు తగ్గట్టు మారుతుంది కానీ ఏ రోజు కూడా తనను తాను తక్కువ చేసుకొని బోల్డ్ పాత్రలలో.. లిప్ కిస్ సన్నివేశాలలో నటించలేదు ఈ ముద్దుగుమ్మ.

లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా కీర్తి సురేష్..

Tollywood Heroine: @ 8 years..far from those scenes..!
Tollywood Heroine: @ 8 years..far from those scenes..!

మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈమె.. రెండవ సినిమాతో ఏకంగా జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా సినీ ప్రేక్షకులకు దగ్గరయింది.. ఆమె ఎవరో కాదు మహానటి సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది.. ఆ తర్వాత మహానటి సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకొని.. అతి తక్కువ సమయంలోనే నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కీర్తి సురేష్ ప్రతిభను డైరెక్టర్లు క్యాచ్ చేయడం లేదా..

తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించిన కీర్తి సురేష్ ప్రతిభకు, నటనకు సరైన పాత్రలు అవకాశాలు రావడం లేదన్న విషయం తెలిసిందే. చాలా కాలం పాటు వరుసగా హిట్స్ అందుకున్న ఈమె దసరా సినిమాతో ఒక్కసారిగా తన ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకుంది.. నాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో తన నటనతో ఇరగదీసింది.. ఇకపోతే కీర్తి సురేష్ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ గ్లామర్ రోల్స్ మాత్రం రాలేదు.. అంతేకాదు ఇప్పటివరకు లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటించలేదు.

- Advertisement -

అందుకే నితిన్ సినిమా రిజెక్ట్..

గతంలో నితిన్ హీరోగా నటించిన ఒక సినిమాలో లిప్ లాక్ సన్నివేశం ఉందని తెలిసి..ఆ సినిమాని కూడా రిజెక్ట్ చేసిందట.. ఆ తర్వాత రెండేళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో రంగ్ దే సినిమా వచ్చింది.. ఇక మరొకవైపు సర్కారు వారి పాట సినిమాతో కాస్త గ్లామర్ గా కనిపిస్తున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ..

కీర్తి సురేష్ పై రూమర్స్ వైరల్..

అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఒక్కసారిగా బాలీవుడ్ లోకి వెళ్లి లిప్ లాక్ సన్నివేశాలలో చేయబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అసలు విషయం తెలిసే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు