Tollywood Heroine: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే..?

Tollywood Heroine.. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏ అమ్మాయి అయినా సరే హీరోయిన్ గా ఎదగడం చాలా కష్టంగానే ఉంటుందంటూ తెలియజేస్తూ ఉంటారు. హీరోలకు అవకాశాలు వచ్చినట్లు హీరోయిన్లకు రావు..ప్రత్యేకించి ఒకటి రెండు సినిమాలు ఫెయిల్యూర్ అయితే.. ఇక అవకాశాలు వారి దరిదాపుల్లోకి కూడా రావని.. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ తెలిపిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నా.. ఆ తర్వాత కెరియర్ కొనసాగించడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ మాత్రం తన చేజేతులారా తన కెరీయర్ నే నాశనం చేసుకున్నది. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంది? అనే విషయాల గురించి పూర్తిగా చూద్దాం.

పలు భాషల్లో పాపులారిటీ..

హీరోయిన్ నిఖిత.. తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాలలో నటించింది ఈ అమ్మడు. ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాణిగా కూడా పేరు సంపాదించింది.. 2002లో హాయ్ అనే సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2003లో కళ్యాణ రాముడు వంటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోగా.. ఆ వెంటనే ఖుషి ఖుషీగా, మహారాజశ్రీ, సంబరం తదితర చిత్రాలలో నటించింది.. ముఖ్యంగా నాగార్జున నటించిన డాన్ చిత్రంలో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది నిఖిత.

పెళ్లైన హీరోతో ఎఫైర్.. మూడేళ్లు నిషేధం..

Tollywood Heroine: Affair with a married hero.. if cut..?
Tollywood Heroine: Affair with a married hero.. if cut..?

అలా హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ నటుడు దర్శన్ తో ప్రేమలో పడిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అప్పటికే దర్శన్ కు వివాహమయిందట.. అయినా కూడా ఇద్దరూ క్లోజ్ గా ఉండడం తో ఈ విషయాన్ని దర్శన్ భార్య విజయలక్ష్మి కి తెలియడంతో దర్శన్ పైన పోలీస్ కేసు కూడా పెట్టిందట. దీంతో పోలీసులు కూడా అతన్ని అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హీరోయిన్ నిఖిత పేరు హాట్ టాపిక్ మారింది. దీంతో ఈమె పై మూడేళ్ల పాటు కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా నిషేధం విధించారు.

- Advertisement -

నిషేధం ఎత్తివేసినా అవకాశాలు రాలేదు..

అయితే నిషేధం పూర్తి అయిన తర్వాత కూడా నిఖితకు అవకాశాలే రాలేదు. దీంతో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు ఇటీవలే తెలియజేసింది.. చివరికి చేసేది ఏమీ లేక 2017లో ప్రముఖ వ్యాపారవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేస్తూనే ఉంది.

సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆరాటం..

ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని తెగ తాపత్రయపడుతోంది ..అందులో భాగంగానే రకరకాల గ్లామర్ ఫోటో షూట్ లోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇటు అభిమానులు అటు డైరెక్టర్ ల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది.. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు