Tollywood Heroine:తండ్రి వయసున్న నిర్మాత.. తెలుగు బ్యూటీతో అసభ్యకర ప్రవర్తన..!

Tollywood Heroine.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలావరకు హీరోయిన్లు, నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు ఇప్పటికి కూడా ఎంతోమంది అమ్మాయిలు ఇలా క్యాస్టింగ్ కౌచ్ బాధలను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఎవరు కూడా మాకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పేవారు కాదు. కానీ 2018లో మొదలైన ఈ మీ టూ ఉద్యమం తర్వాత చాలామంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక తెలుగు హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ తండ్రి వయసున్న ఒక నిర్మాత తనతో అసభ్యకరంగా మాట్లాడారు అంటూ ఆరోపణలు చేసింది.

Tollywood Heroine: Father's age producer.. Indecent behavior with Telugu beauty..!
Tollywood Heroine: Father’s age producer.. Indecent behavior with Telugu beauty..!

తండ్రి వయసున్న వ్యక్తి ఇబ్బంది పెట్టాడు…

ఆమె ఎవరో కాదు పేక మేడలు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ అనూష కృష్ణ. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను నటించి మెప్పించింది.. కన్నడలో అప్పటికే రెండు సినిమాలు చేసిన ఈమె.. అవి రిలీజ్ కాకపోవడంతో ఈమె మొదటి సినిమా పేక మేడలు అని చెప్పవచ్చు.. తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకొని ఎంతో కాన్ఫిడెంట్ గా తెలుగు మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె, క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్ నువ్వే అన్నాడు. అయితే అతడు అలా మాట్లాడేసరికి, అతడి మాటలు ముందే అర్థం చేసుకున్న నేను వెంటనే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్నాను.. అయితే అతడు నాకు అటువంటి ఇబ్బంది ఏమి లేదు అన్నాడు.. అంతే కాదు తనకు గంట టైం ఇస్తాను.. నీ అభిప్రాయం ఏంటో చెప్పు.. అని నాకే చెప్పాడు. ఇక ఏం చేయాలో తెలియక అక్కడినుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను అంటూ చెప్పుకొచ్చింది అనూష కృష్ణ. ఇకపోతే తండ్రి వయసున్న వ్యక్తి ఇలా తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఇలాంటి అసభ్యకర కామెంట్లు చేయడం నిజంగా బాధాకరం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

క్యాబ్ డ్రైవర్ ఓదార్చాడు..

అనూష మాట్లాడుతూ.. హీరోయిన్గా నాకు అవకాశం రాకపోయినా పర్లేదు, నేను చదివిన చదువుకు నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. దానిని చేసుకొని నేను బ్రతకగలను. అయితే హీరోయిన్ అవ్వాలనుకుని ఇండస్ట్రీకి వస్తే ఇక్కడ మాత్రం ఇలాంటి వ్యక్తుల మధ్య జీవించడం సాధ్యమైన పని కాదు. ఇప్పటికీ కూడా ఆ పరిస్థితి తలుచుకుంటే నాకు ఏడుపొస్తుంది ..ఆ సమయంలో నా ఏడుపు చూసి క్యాబ్ డ్రైవర్ నన్ను ఓదార్చాడు అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో నాలాగే ఎంతోమంది నటీమణులు తప్పని పరిస్థితిల్లో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వారి ఆవేదనను ఇప్పటికైనా సినీ పెద్దలు తెలుసుకొని ఇండస్ట్రీలో ఇలాంటివి జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పింది అనూష కృష్ణ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు