Tollywood Heroine.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఇద్దరమ్మాయిలతో అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ బ్యూటీ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ – అమలాపాల్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది. దీంతో ఈమెకు పలు చిత్రాలలో అవకాశాలు లభించాయి. అయితే ఈ మధ్యకాలంలో అమలాపాల్ కి కాస్త సినిమాలలో అవకాశాలు తగ్గడంతో తమిళ్ ఇండస్ట్రీకే పరిమితమైంది. అక్కడే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు చేస్తూ అదరగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
డైరెక్టర్ తో పెళ్లి, విడాకులు..
ఇదిలా ఉండగా ఈమె వైవాహిక బంధం లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకెళితే ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ తో ప్రేమలో పడి 2014లో వివాహం చేసుకున్నారు. మూడేళ్లపాటు సంతోషంగా జీవించిన ఈ జంట 2019లో ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. అయితే ఆ ఏడాది విడాకులు తీసుకున్న వెంటనే దర్శకుడు ఇంకో వివాహం చేసుకున్నాడు. అయితే అమలా పాల్ మాత్రం ఆ బాధ నుంచి బయటపడ్డానికి సినిమాలలో నటించడం ప్రారంభించింది. తర్వాత వెబ్సైట్లో ఉన్న జగత్ దేశాయ్ తో ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకుంది .
పెళ్లికి ముందే తల్లి..
ఇద్దరు ప్రేమించుకున్న వీరు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఇలై అనే కుమారుడికి కూడా జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడించింది. అందులో భాగంగానే పెళ్లికి ముందే గర్భవతి అయ్యానని , అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నామని తెలిపింది. మొదట్లో నేను హీరోయిన్ అని నా భర్తకు తెలియదు అంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమలాపాల్ షేర్ చేసిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు ఈ విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కూడా.
జగత్ తో పెళ్లి , గర్భవతిపై క్లారిటీ..
అమలాపాల్ మాట్లాడుతూ.. నేను నా జీవితంలో మొదటి దశలో ఎంతో నష్టపోయాను. అందుకే రెండవ దశను ప్రారంభించడానికి కాస్త వెనుకడుగు వేశాను. కానీ నా భర్త నా ఆలోచనలు అన్నింటినీ మార్చేశాడు..మేము డేటింగ్ చేశాము. నా బాయ్ ఫ్రెండ్ నిర్ణయాలను కాదనలేక పోయాను. అందుకే డేటింగ్ చేసిన నెల రోజులకే నేను గర్భం దాల్చాను. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాము అంటూ సంచలన విషయాలు వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా అమలాపాల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
అమలాపాల్ సినిమాలు..
మలయాళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. నీల తామర అనే సినిమాలో చిన్న పాత్ర చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ గా ఎంపికై స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.