Tollywood Heroine: ఆ డైరెక్టర్ అంటే పిచ్చి.. చూద్దామని వెళ్తే ఏకంగా హీరోయిన్ అయిపోయింది..!

Tollywood Heroine: అదృష్టం అనేది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా వరిస్తుందో చెప్పడం కష్టం.. ఏదో కావాలని వెళితే మరేదో అదృష్టం మన వెంట వస్తుంది. అదే అద్భుతం అంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ కూడా అంతే.. ఏదో ఒక డైరెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని అతడిని ఒక్కసారైనా చూడాలని అనుకుంది. అందులో భాగంగానే సినిమా షూటింగ్ జరుగుతుంటే.. ఆయనను చూడడానికి అందరితో పాటే వెళ్ళింది.. కానీ అనుకోకుండా ఆమె ఆ డైరెక్టర్ దృష్టిలో పడి స్టార్ హీరోయిన్ అయిపోయింది.. రాళ్లదారిలో వెళ్తున్నప్పుడు కాలికి బంగారు తీగ తగిలినట్లు ఏదో నచ్చిన డైరెక్టర్ ను చూద్దామని వెళ్తే.. ఏకంగా హీరోయిన్ అయ్యే అవకాశాన్ని కొట్టేసింది. ఆ టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది కూడా.. ఇంతకూ ఆమె ఎవరు..? ఆ డైరెక్టర్ ఎవరు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Tollywood Heroine: That director is crazy.. If we go to see, she has become a heroine..!
Tollywood Heroine: That director is crazy.. If we go to see, she has become a heroine..!

అనతి కాలంలోనే ఊహించని స్టార్డం..

ఆమె ఎవరో కాదు సమంత.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతూ సౌత్ నార్త్ అన్నింటిలో కూడా చక్రం తిప్పేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తన నటనతో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రెండు భాషల్లో సినిమా చేసి ఒక ఊపు ఊపేసింది. దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది .. సీనియర్ హీరోలు తప్ప అందరి సూపర్ స్టార్లతో జోడి కట్టింది సమంత.. ఇప్పుడు తిరుగులేని స్టార్డం దక్కించుకుంది.. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు ఫంక్షన్లలో వెల్కమ్ గర్ల్ గా పని చేసిన ఈమె.. ఫ్యాషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి పలు యాడ్స్ లో కూడా చేసింది.. ఇక సినిమాలపై ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చింది..

గౌతమ్ మీనన్ ను చూద్దామని వెళ్తే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది..

ఇక తాజాగా తన మొదటి సినిమా అవకాశం రావడం వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ని కూడా రివీల్ చేసింది సమంత.. సమంత మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ గౌతమ్ మీనన్ అంటే చాలా ఇష్టం ..నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా.. ఆయనంటే పిచ్చి.. ఆయన సినిమాలు వస్తే చాలు పక్కకు కూడా వెళ్ళను.. అందుకే ఆయన ఎలా ఉంటారో చూద్దామని.. ఒకసారి ఏ మాయ చేసావే సినిమా ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్లాను.. ఎలాగైనా ఆయనను కలవాలని చెప్పి.. ఆడిషన్ లో పాల్గొంటే ఆయనను చూడవచ్చు కదా..చూసి వస్తే చాలు అనుకున్నా.. హీరోయిన్ అవ్వాలని.. సెలెక్ట్ కావాలని అస్సలు ఊహించుకోలేదు.. నా మైండ్ లో కూడా అది లేదు.. కానీ ఆడిషన్ చేశాక హీరోయిన్గా ఎంపిక అయ్యావు అని చెప్పారు.. దెబ్బకి నేను కూడా షాక్ అయ్యాను. అంటూ చెప్పుకొచ్చింది సమంత..

- Advertisement -

హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా ఎంట్రీ..

ఇక ఈ సినిమా తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఇక తెలుగులో అందరు హీరోలతో నటించిన ఈమె.. నాగచైతన్యతో ఐదు సినిమాలు చేసింది.. ఆయనతోనే ప్రేమలో పడి.. 2017లో వివాహం చేసుకొని.. 2021లో విడిపోయింది.. ఈ ఇద్దరు విడిపోవడానికి స్పష్టమైన కారణం ఏంటో తెలియదు.. ఆ తర్వాత ఈమె మయోసైటీస్ వ్యాధితో పోరాటం చేస్తూ ఇప్పటికి కోలుకునే ప్రయత్నాలు చేస్తోంది.. ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారిన సమంత ఇప్పుడు మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు