Top Trending Tollywood Heroines: సంవత్సరం పాటు సినిమాలు చేయకపోయినా నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసిన సమంత…!

Top Trending Tollywood Heroines: ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి అడుగు పెడతారు.. కానీ కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకోగలరు. అలా సంపాదించుకున్న వారు కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంటారు. ఇక అలా సంపాదించుకున్న వారిలో సమంత కూడా ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

ఇక ఇటీవల చైతుతో ప్రేమ పెళ్లి.. విడాకులు అని వార్తల్లో నిలిచింది. అదేవిధంగా మయోసైటీస్ వ్యాధికి గురై తాజాగా రికవరీ అయింది. ప్రస్తుతం మరోసారి రియంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇక సమంత ఈ సంవత్సర కాలం పాటు ఏ సినిమా చేయకపోయినా తన పాపులారిటీ ఏ విధంగా ఉందో తాజాగా రిలీజ్ చేసిన మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లో అర్థమైంది.

Tollywood Heroines: Samantha who hit the number one position despite not doing any movies for a year
Tollywood Heroines: Samantha who hit the number one position despite not doing any movies for a year

తాజాగా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఏప్రిల్ 2024 లిస్ట్ రిలీజ్ అయింది. ఈ లిస్టులో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకోగా కాజల్ అగర్వాల్ రెండవ స్థానాన్ని దక్కించుకుంది. అదేవిధంగా అనుష్క శెట్టి మూడవ స్థానం.. శ్రీ లీల నాలుగవ స్థానం.. సాయి పల్లవి ఐదవ స్థానం.. రష్మిక మందన ఆరవ స్థానం.. మిల్కీ బ్యూటీ తమన్నా ఏడవ స్థానం.. కీర్తి సురేష్ ఎనిమిదవ స్థానం.. పూజా హెగ్డే 9వ స్థానం.. అనుపమ పదవ స్థానం దక్కించుకున్నారు. అలా పూజ కంటే గోరాది ఘోరమైన స్థానాన్ని దక్కించుకుంది అనుపమ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు