Tollywood : వెండితెరపై అర్జునుడిగా నటించి మెప్పించిన స్టార్ హీరోలు వీరే.!

Tollywood : టాలీవుడ్ లో ఇప్పుడంతా కల్కి2898AD మూవీ హవానే నడుస్తుంది. ఎక్కడ విన్నా ఈ సినిమా విషయాలే చర్చించుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి అంత ఎక్కువగా మాట్లాడుకోవడానికి కారణం, సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాని మైథాలజీకి టచ్ చేయడమే అని చెప్పొచ్చు. కల్కి సినిమాలో ఇతిహాసాల్లో అశ్వద్ధామ పాత్రని ఇప్పటి కాలానికి లింక్ చేయడం, అలాగే సినిమాలో మహాభారత కాలానికి సంబంధించిన శ్రీ కృష్ణుడు సహా, అర్జునుడు, కర్ణుడు పాత్రలను కూడా ఈ సినిమాలో చూపించడం పట్ల ప్రేక్షకులు అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇండస్ట్రీ వ్యాప్తంగా వైరల్ అవుతున్న టాపిక్ అర్జునుడి పాత్ర. ఈ సినిమాలో అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా, కనిపించింది రెండు సార్లే, అది కూడా 3 మూడు నిమిషాల లోనే ఉంటుంది. కానీ ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. అయితే అర్జునుడుగా విజయ్ ని చూపించడం పట్ల మిశ్రమ స్పందన వినిపించింది. ఈ క్రమంలో తెలుగులో ఇప్పటివరకూ అర్జునుడి పాత్రలో నటించిన వాళ్ళ గురించి చర్చ నడుస్తుంది. ఇక తెలుగు తెరపై (Tollywood) ఇప్పటివరకు అర్జునుడి పాత్రలో నటించిన స్టార్ హీరోలు ఎవరో ఒకసారి లుక్కేద్దాం..

Tollywood Heros As Arjuna Roles

ఎన్టీ రామారావు

నట సార్వభౌమ ఎన్టీఆర్ తెలుగులో అర్జునుడి పాత్రలో ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన నర్తన శాల, బబ్రు వాహన, ప్రమీలార్జునీయం, వంటి చిత్రాల్లో అర్జునుడిగా నటించి మెప్పించారు.

- Advertisement -

అక్కినేని నాగేశ్వరరావు

నట సామ్రాట్ నాగేశ్వరరావు శ్రీ కృష్ణార్జున యుద్ధం చిత్రంలో అర్జునుడిగా నటించి మెప్పించారు.

కృష్ణ

నట శేఖర కృష్ణ కురుక్షేత్రం చిత్రంలో అర్జునుడిగా నటించి మెప్పించగా, అంతకు ముందు కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసాడు.

కృష్ణంరాజు

రెబల్ స్టార్ నటించిన భక్త కన్నప్పలో అర్జునుడిగా నటించారు. ఆ పాత్రే మరు జన్మలో కన్నప్ప గా మారుతుందని తెలిసిందే.

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పౌరాణిక చిత్రాల్లో నటించకపోయినా, ఆ పాత్రల వేశాలు కొన్ని చిత్రాల్లో వేశారు. చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ చిత్రంలో కొంతసేపు అర్జునుడిగా నటించి మెప్పించారు.

బాలకృష్ణ

నటసింహం బాలకృష్ణ ఆయన నటించిన శ్రీకృష్ణార్జున విజయం లో అర్జునుడిగా నటించగా, పాండవ వనవాసం రీమేక్ లో నటించినా, ఆ సినిమా సౌందర్య మరణంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసారు.

హరికృష్ణ

హరికృష్ణ దానవీర శూరకర్ణ లో అర్జునుడిగా నటించి మెప్పించారు. ఈ సినిమా ఎన్టీఆర్ దర్శకత్వంలోనే రూపొందిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు