Kajal Agarwal: కాజల్ అగర్వాల్ పరువు తీసిన టాలీవుడ్ హీరోలు..?

Kajal Agarwal:  సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత చందమామ అనే సినిమాలో నటించినప్పటికీ సినిమా పెద్దగా ఇట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత పలు తమిళ్ సినిమాలలో నటించిన కాజల్.. తిరిగి మగధీర సినిమాతో ఓ పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

దీంతో వరుస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్లింది కాజల్. అలా కెరీర్ దూసుకెళ్తున్న సమయంలో 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని సినిమాలు చేసే సంఖ్య తగ్గించేసింది. పెళ్లి తర్వాత ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి.. మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కాజల్ అందంలో చాలా మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా తయారవ్వడంతో పాటు పెద్ద ఆంటీలాగా కనిపించింది. దీంతో కాజల్ కి పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి అనే సినిమాలో నటించింది కాజల్.

ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈమెకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఇప్పుడు బరువు తగ్గేందుకు ప్రతిరోజు కసరత్తులు చేస్తుందట చందమామ. ఇప్పుడు ఆమె ముఖంలో కల లేకపోవడంతో స్టార్ హీరోలు పెద్దగా పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం కాజల్ చేతిలో సత్యభామ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ, ఇండియన్ 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమాలలో ఏ ఒక్కటి సక్సెస్ అందుకున్నా కాజల్ మళ్ళీ ఎప్పటిలా ఇండస్ట్రీలో దూసుకెళ్తుందని.. లేదంటే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పవలసిందేనని అంటున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు